Brinjal Benefits: వంకాయలను తింటే గుండె సమస్యలు ఫసక్.. ప్రయోజనాలు తెలిస్తే ఇట్టే తినేస్తారు..

|

Sep 08, 2021 | 10:37 AM

వంకాయ పేరు చెబితే చాలు చాలా మంది ఎక్స్‏ప్రెషన్స్ మరిపోతాయి. తినడం ఇష్టముండదని.. తింటే స్క్రీన్ ఎలర్జీ వస్తుందని.. కాళ్ల నొప్పులు వస్తాయని

Brinjal Benefits: వంకాయలను తింటే గుండె సమస్యలు ఫసక్.. ప్రయోజనాలు తెలిస్తే ఇట్టే తినేస్తారు..
Brinjal
Follow us on

వంకాయ పేరు చెబితే చాలు చాలా మంది ఎక్స్‏ప్రెషన్స్ మరిపోతాయి. తినడం ఇష్టముండదని.. తింటే స్క్రీన్ ఎలర్జీ వస్తుందని.. కాళ్ల నొప్పులు వస్తాయని అంటుంటారు. మరికొందరు అస్సలు వంకాయను కూడా టచ్ చేయరు. వంకాయ కర్రీకి అమడ దూరంలో ఉంటారు. కానీ వంకాయ వలన మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని సంగతి చాలా మందికి తెలియదు. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వంకాయలో విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, మాంగనీస్, ఫోలేట్, పొటాషియం మొదలైన పోషకాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఇందులో నియాసిన్, మెగ్నీషియం మరియు రాగి కూడా చిన్న మొత్తంలో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా కనిపిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ప్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ఫ్రీ రాడికల్స్ శరీరంలోని కణజాలాలకు హాని కలిగిస్తాయి. యాంటీ-ఆక్సిడెంట్లు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉండే వర్ణద్రవ్యం వంకాయలో ఆంథోసైనిన్స్ కనిపిస్తాయి. గుండె ఆరోగ్యం నుండి ఊబకాయం వరకు అన్ని రకాల వ్యాధులను తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని వంకాయ కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండె సమస్యలను తగ్గిస్తాయి. వంకాయను తీసుకోవడం వలన గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇక ఇటీవల జరిపిన ఓ అధ్యానయంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఎలుకలకు రెండు వారాల పాటు 10 మి.లీ రసం ఇచ్చారు. దీంతో వాటి కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గాయి. వంకాయ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. వంకాయలో ఫైబర్ అధికంగా ఉన్నందున ఇది జీర్ణక్రియ, చక్కెర శోషణ రేటును తగ్గిస్తుంది. చక్కెర నెమ్మదిగా శోషణ కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీంతో వంకాయ ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. అధిక ఫైబర్ ఉండటం వలన ఇది మీ పొట్టని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. అయితే ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. బరువును కాపాడుకోవడంలో సహాయపడతాయి. వంకాయ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. రోజువారీ ఆహారంలో వంకాయను చేర్చడం ద్వారా మలబద్ధకం లేదా కడుపు సమస్యలను తగ్గించుకోవచ్చు.

Also Read: RC 15 : రామ్ చరణ్- శంకర్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.. అదేంటంటే..

Hair growth Tips: మీ జుట్టు వేగంగా.. ఒత్తుగా పెరగడానికి వంటింటి చిట్కాలు..