Beauty Tips: టీబ్యాగ్స్‌ను వాడి పడేస్తున్నారా.? ఈ లాభాలు తెలిస్తే ఇకపై ఆ పని చేయరు..

Beauty Tips: ఇటీవల చాలా మంది గ్రీన్‌ టీ తాగడాన్ని (Green Tea) అలవాటు చేసుకుంటున్నారు. ఆరోగ్యానికి మంచిది కావడంతో వైద్యులు సైతం వీటిని సిఫార్స్‌..

Beauty Tips: టీబ్యాగ్స్‌ను వాడి పడేస్తున్నారా.? ఈ లాభాలు తెలిస్తే ఇకపై ఆ పని చేయరు..
Beauty Tips

Edited By:

Updated on: Mar 02, 2022 | 7:37 AM

Beauty Tips: ఇటీవల చాలా మంది గ్రీన్‌ టీ తాగడాన్ని (Green Tea) అలవాటు చేసుకుంటున్నారు. ఆరోగ్యానికి మంచిది కావడంతో వైద్యులు సైతం వీటిని సిఫార్స్‌ చేస్తున్నారు. దీంతో గ్రీన్‌ టీ వాడకం బాగా పెరిగిపోయింది. అయితే ఈ గ్రీన్‌ టీ బ్యాగ్‌లను (Tea Bags) ఒకసారి వాడిన తర్వాత డస్ట్‌బిన్‌లో పడేస్తుంటాం. అయితే వాడిన టీబ్యాగ్‌లతో ఎన్నో లాభాలున్నాయన్న విషయం మీకు తెలుసా.? ముఖ్యంగా వాడేసిన టీ బ్యాగ్‌లు అందాన్ని రెట్టింపు చేస్తాయి. టీ బ్యాగ్‌లతో ఉన్న ఈ బ్యూటీ సీక్రెట్స్‌ తెలిస్తే ఇకపై వాడిన టీ బ్యాగ్‌లను డస్ట్‌బిన్‌లో పడేయకుండా జాగ్రత్తగా దాచుకుంటారు. ఇంతకీ టీ బ్యాగ్‌ల వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

* టీ తాగిన తర్వాత టీ బ్యాగ్‌లో ఉండే మిశ్రమాన్ని ఫేస్‌ స్క్రబర్‌గా ఉపయోగించుకోవచ్చు. ఫేస్‌పై అప్లై చేసి నెమ్మదిగా స్క్రబింగ్‌ చేసుకుంటే ముఖంపై ఉన్న రంధ్రాలు చిన్నగా మారుతాయి. అంతేకాకుండా ముఖంపై మెరుపు వస్తుంది. ఇక ఈ మిశ్రమానికి ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలిపి ముఖానికి అప్లై చేసిన 5 నిమిషాలు స్క్రబింగ్‌ చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

* వాడి పడేసే టీ బ్యాగ్స్‌ కళ్లకు కూడా మేలు చేస్తాయి. టీ బ్యాగ్‌లను వాడిన తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. ఇలా చల్లబడిన తర్వాత కళ్లపై పెట్టుకొని కొద్ది కళ్లు మూసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే కళ్లవాపు, నొప్పి తగ్గుతుంది. డార్క్‌ సర్కిల్స్‌ కూడా తగ్గుతాయి.

* వెంటుక్రల అందానికి టీ బ్యాగ్స్‌ ఉపయోగపడతాయి. ఇవి వెంట్రుకలకు షైనింగ్‌, మెత్తదనాన్ని అందిస్తాయి. ఇందుకోసం షాంపూతో స్నానం చేసే కంటే ముందు టీబ్యాగ్‌లను వేడి నీలో వేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తలకు పట్టి ఆ తర్వాత షాంపూతో స్నానం చేయాలి.

* చర్మ సంబంధిత సమస్యలకు కూడా టీ బ్యాగ్స్‌ ఉపయోగపడతాయి. దద్దుర్లు ఉన్న చోట టీబ్యాగ్‌లోని మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల సమస్య నుంచి బయటపడొచ్చు.

* టీబ్యాగ్స్‌లోని మిశ్రమం షేషియల్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వేడి నీటిని నింపాలి. అనంతరం అందులో టీబ్యాగ్స్‌ వేసి కాటన్‌ టవల్‌ను ముంచాలి. తర్వాత నీటిని బాగా పిండేసి టవల్‌ను ముఖం మీద వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.