Cancer: మీకు ఈ 5 అలవాట్లు ఉంటే క్యాన్సర్ బారిన పడినట్లే.. వెంటనే మానుకోండి

|

Jan 31, 2024 | 5:11 PM

ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం మాత్రమే సరిపోదు.. కొన్ని చెడు అలవాట్లను విస్మరించడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం.. కొన్ని అలవాట్లను వదిలివేయడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. దీంతో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు.. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగల ఐదు చెడు అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

Cancer: మీకు ఈ 5 అలవాట్లు ఉంటే క్యాన్సర్ బారిన పడినట్లే.. వెంటనే మానుకోండి
Cancer
Follow us on

క్యాన్సర్.. ఈ మాట వింటేనే అందరూ భయంతో వణికిపోతారు. అత్యంత ప్రమాదకమైన వ్యాధి క్యాన్సర్.. చికిత్స ఉన్నప్పటికీ.. కొన్ని సార్లు ప్రాణాలు కూడా తీస్తుంది. క్యాన్సర్ వల్ల ఎవరైనా ప్రమాదంలో పడవచ్చు.. అయితే, కొన్ని చెడు అలవాట్లు ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. క్యాన్సర్ నివారణ అనేది సుదీర్ఘమైన, సంక్లిష్టమైన మార్గం.. దీనిలో కేవలం ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం మాత్రమే సరిపోదు.. కొన్ని చెడు అలవాట్లను విస్మరించడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం.. కొన్ని అలవాట్లను వదిలివేయడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. దీంతో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు.. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగల ఐదు చెడు అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

ధూమపానం: ధూమపానం అనేది నేరుగా క్యాన్సర్‌కు కారణమయ్యే అతి ముఖ్యమైన చెడు అలవాటు. సిగరెట్లలో ఉండే హానికరమైన రసాయనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా నోరు, గొంతు, కడుపు, మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. మీరు ధూమపానం చేస్తుంటే, ఈరోజే దాన్ని మానేసేందుకు గట్టి నిర్ణయం తీసుకోండి.

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. ఇది కాలేయాన్ని దెబ్బతీస్తుంది. శరీరంలో క్యాన్సర్ కారకాలను పెంచుతుంది. ముఖ్యంగా నోటి, గొంతు, కాలేయం క్యాన్సర్ ముప్పు అధికంగా మద్యం సేవించడంతో పెరుగుతుంది. కాబట్టి, మితమైన మొత్తంలో ఆల్కహాల్ తీసుకోండి లేదా పూర్తిగా వదిలివేయడం మంచిది.

అనారోగ్యకరమైన ఆహారం: అనారోగ్యకరమైన ఆహారం మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, శుద్ధి చేసిన పిండి, మితిమీరిన రెడ్ మీట్, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. బదులుగా, మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు తీసుకోండి..

లైఫ్‌స్టైల్: నేటి బిజీ లైఫ్‌లో మనం శారీరకంగా చురుగ్గా ఉండలేకపోతున్నాం.. దీనికి కారణం దుర్బర జీవనశైలే.. వ్యాయామం చేయకపోవడం వల్ల ఊబకాయం మాత్రమే కాకుండా పెద్దప్రేగు, రొమ్ము, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల తేలికపాటి వ్యాయామం చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఒత్తిడి: ఒత్తిడి మీకు మానసికంగా, శారీరకంగా హానికరం. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం, లోతైన శ్వాస ఇతర వ్యాయామాలను, యోగా లాంటి పద్ధతులను అనుసరించడం మంచిది.

అయితే.. ఈ చెడు అలవాట్లను వదులుకోవడం అంత సులభం కాదు, కానీ మీ ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. ఈ చెడు అలవాట్లను వదిలేయడంలో మీకు సమస్య ఉంటే, మీ కుటుంబం లేదా స్నేహితుల సహాయం తీసుకోండి లేదా డాక్టర్ లేదా థెరపిస్ట్‌ని సంప్రదించండి. గుర్తుంచుకోండి.. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల, క్రమం తప్పకుండా వైద్యుడి వద్దకు వెళ్లి మిమ్మల్ని మీరు తనిఖీ చేసుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..