Yoga Asanas: మెడ నొప్పి మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తోందా? ఈ మూడు ఆసనాలతో ఉపశమనం పొందండి..

Yoga Asanas: చాలా మందికి మెడ నొప్పి తీవ్ర ఇబ్బంది కిలిగిస్తుంటుంది. రాత్రి నిద్రపోయిన సమయంలో తలగడ సరిగా పెట్టుకోవడం వల్లనో..

Yoga Asanas: మెడ నొప్పి మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తోందా? ఈ మూడు ఆసనాలతో ఉపశమనం పొందండి..
Neck Pain

Updated on: Sep 24, 2021 | 12:28 PM

Yoga Asanas: చాలా మందికి మెడ నొప్పి తీవ్ర ఇబ్బంది కిలిగిస్తుంటుంది. రాత్రి నిద్రపోయిన సమయంలో తలగడ సరిగా పెట్టుకోవడం వల్లనో.. ఒకవైపు నిద్రించడం వల్లనో.. ఒక్కోసారి మెడ పట్టేస్తుంటుంది. మెడ నరాలు జివ్వుమని లాగుతుంటాయి. అందకే మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి యోగా శాస్త్రంలో అనేక ఆసనాలు ఉన్నాయి. ముఖ్యంగా మెడ నొప్పి తగ్గడానికి మూడు ఆసనాలు మంచి ఫలితాలను ఇస్తాయని యోగా నిపుణులు చెబుతున్నారు. మరి ఆ మూడు ఆసనాలేంటి.. వాటిని ఎలా వేస్తారు.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బాలసనం..: ఈ ఆసనం వేయడం ద్వారా మెడ నరాలు వదులు అవుతాయి. ఈ స్ట్రెచ్ వల్ల నిద్రలో మెడ నరాలు పట్టుకున్నా ఉపశమనం లభిస్తుంది.

మార్గరీషణ..: ఈ వ్యాయామం మీ వెన్నెముకను సాగదీస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. భుజాలు, మెడపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఆసనాన్ని 2 నిమిషాల పాటు చేయాల్సి ఉంటుంది.

శవాసన..: మెడ పై ఒత్తిడిని తగ్గించడానికి ఈ యోగాసనం చాలా ఉపయోకరం. ఇది మంచి ఫలితాన్నిస్తుంది. ఈ ఆసనం వేయడం ద్వారా మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.