Health Tips: నేలపై పడుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!

|

Apr 08, 2022 | 8:22 PM

Health Tips: ప్రతిరోజు మంచంలో పరుపై నిద్రించే వ్యక్తులు అనుకోకుండా కిందపడుకుంటే చాలా రిలాక్స్‌గా ఫీలవుతారు. దీనికి కారణం అనేకం ఉన్నాయి. వాస్తవానికి కిందపడుకుంటే బోలెడు

Health Tips: నేలపై పడుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!
Sleeping On The Floor
Follow us on

Health Tips: ప్రతిరోజు మంచంలో పరుపై నిద్రించే వ్యక్తులు అనుకోకుండా కిందపడుకుంటే చాలా రిలాక్స్‌గా ఫీలవుతారు. దీనికి కారణం అనేకం ఉన్నాయి. వాస్తవానికి కిందపడుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరానికి ఎటువంటి సమస్య ఉండదు. అంతేకాకుండా మంచి విశ్రాంతి దొరుకుతుంది. నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి తగ్గడమే కాకుండా శరీరానికి మేలు చేసే ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే నేలపై పడుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా సన్నని చాపను ఉపయోగించాలి. ఇది సౌకర్యంగా లేకుంటే దానిపై సన్నని పరుపు వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎముకల అమరికను సరిగ్గా ఉంచుతుంది. ఎల్లప్పుడూ వీపు నేలకి ఆనుకొని ఉండాలి. తద్వారా వెన్నెముకకి విశ్రాంతిని లభిస్తుంది. ప్రారంభంలో సన్నని దిండును ఉపయోగించవచ్చు. కానీ దిండు లేకుండా నిద్రపోవడాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది శ్వాస సమస్యను తొలగిస్తుంది. మృదువైన పరుపులను ఉపయోగించవద్దు. ఎందుకంటే శరీరంలోని క్రమంగా కొన్ని భాగాలలో నొప్పిగా ప్రారంభమవుతుంది.

వెన్నుపాము ఆరోగ్యంగా ఉంటుంది: మీరు నేలపై పడుకున్నప్పుడు వెన్నుపాము దృఢంగా ఉంటుంది. మీరు మంచం మీద పడుకున్నప్పుడు వెన్నుపాము వంగిపోతుంది. ఇది నేరుగా మెదడును ప్రభావితం చేస్తుంది. నిజానికి వెన్నుపాము కేంద్ర నాడీ వ్యవస్థకు అనుసంధానమై ఉంటుంది. కాబట్టి నేలపై నిద్రించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది: నిజానికి నేలపై పడుకోవడం వల్ల భుజం, తుంటి కండరాలకు గొప్ప ఉపశమనం ఉంటుంది. కండరాల వల్ల తరచుగా వెన్నునొప్పి, భుజం నొప్పి, మెడ నొప్పి మొదలైన సమస్యలు ఉంటాయి. నేలపై పడుకుంటే ఈ సమస్యలన్ని పరిష్కారమవుతాయి.

వెన్నునొప్పికి ఉపశమనం: మీరు నేలపై పడుకున్నప్పుడు మొదటి ప్రయోజనం వెన్నుకి ఎందుకంటే వెన్ను నేలపై మాత్రమే ఉపశమనం పొందుతుంది.

శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది: మీరు మంచం మీద పడుకున్నప్పుడు శరీర వేడి పెరుగుతుంది. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత కూడా పెరగడం ప్రారంభమవుతుంది. మరోవైపు నేలపై పడుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత సరిగ్గా ఉంటుంది.

రక్తప్రసరణ అదుపులో ఉంటుంది: నేలపై పడుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల కండరాలకు గొప్ప ఉపశమనం లభిస్తుంది. నేలపై పడుకోవడం వల్ల మెదడుకు ప్రశాంతత లభిస్తుంది. ఇది స్వయంచాలకంగా ఒత్తిడిని తగ్గిస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

White Hair: ఐదు కారణాల వల్ల జుట్టు తెల్లబడుతోంది.. అవేంటో తెలుసుకొని పరిష్కరించుకోండి..!

IPL 2022: రవీంద్ర జడేజా చారిత్రాత్మక మ్యాచ్‌.. ధోని,రైనా తర్వాత ఆ క్లబ్‌లో చేరిన మూడో ఆటగాడు..

Health: కరోనా తర్వాత ఈ వ్యాధి ముదురుతోంది.. 20 నుంచి 30 సంవత్సరాలవారే బాధితులు..!