Heart Problems: ఇప్పుడు డయాబెటిస్ ఔషధంతో గుండె జబ్బుల కేసులను కూడా నియంత్రించవచ్చు. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ యొక్క తాజా అధ్యయనం ప్రకారం, అధిక రక్తంలో చక్కెర నియంత్రణ మందు ‘అంపాగ్లిఫ్లోజిన్’ రోగులను గుండె ఆగిపోకుండా కాపాడుతుంది. ఈ ఔషధం తీసుకున్న కేవలం మూడు నెలల్లోనే, గుండె పని సామర్థ్యం పెరుగుతుంది. గుండె ఆగిపోయే ప్రమాదం తగ్గుతుంది. పరిశోధనలో పాల్గొన్న రోగులు కూడా బరువు కోల్పోయారని, రక్తపోటు మెరుగుపడిందని పరిశోధన తెలిపింది. టైప్ 2 డయాబెటిస్ గుండె జబ్బుల ప్రమాదాన్ని మూడు రెట్లు పెంచుతుందని పరిశోధకులు అంటున్నారు. అదే సమయంలో, మూడవ వంతు మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు.
చక్కర వ్యాధి నియంత్రణ కోసం ఉపయోగించే ఆంపాగ్లిఫ్లోజిన్ ఔషధం శరీరానికి చేరుకుంటుంది. మూత్రం ద్వారా అదనపు చక్కెరను తొలగించడానికి పనిచేస్తుంది. ఇది చక్కెర రక్తంలోకి రాకుండా నిరోధిస్తుంది, అందువల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఈ మందు మధుమేహంతో బాధపడుతున్న రోగులలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఈ మందు పని చేస్తుంది.
పరిశోధనల ప్రకారం, ఒక మిలియన్ బ్రిటన్లు గుండె జబ్బుతో బాధపడుతున్నారు. గుండె బలహీనమైనప్పుడు, రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గినప్పుడు ఇటువంటి సందర్భాలు సంభవిస్తాయి. యూకేలో ప్రతి సంవత్సరం, ఐదుగురిలో ఒకరు గుండెపోటుతో మరణిస్తున్నారు. అటువంటి రోగులలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన కొత్త పరిశోధనల ప్రకారం, టైప్ -2 డయాబెటిస్ తో బాధపడుతున్న 18 మంది రోగులకు ఈ మందు ఇచ్చారు. 12 వారాలు వారిని పర్యవేక్షించారు. ఈ రోగులలో ఎవరికీ గుండె ఆగిపోలేదు. పరిశోధన ప్రారంభానికి ముందు, ఈ రోగుల గుండె బలహీనంగా ఉన్నట్లు రిపోర్ట్స్ ఉన్నాయి.
పరిశోధనలో పాల్గొన్న కార్డియాలజిస్ట్ డాక్టర్ షెర్మాన్ తిరునావుక్రుషు మాట్లాడుతూ ఈ పరిశోధనలో చాలా మంది రోగుల గుండె శక్తి మెరుగుపడిందని వెల్లడించారు. దీనితో పాటు రక్తాన్ని పంప్ చేసే గుండె సామర్థ్యం కూడా పెరిగింది. డాక్టర్ షెర్మాన్ చెబుతున్న దాని ప్రకారం ఈ మెడిసిన్ గుండె కండరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా దానిని బలంగా చేస్తుంది.