Growth: చిన్నతనంలో ఎత్తు సరిగా పెరగకపోవడానికి కారణం అదేనట..అది సరిగ్గా ఉంటే పొడుగు గ్యారెంటీ!

|

Nov 07, 2021 | 10:02 AM

మానవుని ఎత్తు, చిన్న వయసులో ఆలస్యమవడానికి కారణం ఏమిటనేదానికి అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సమాధానాన్ని కనుగొంది.

Growth: చిన్నతనంలో ఎత్తు సరిగా పెరగకపోవడానికి కారణం అదేనట..అది సరిగ్గా ఉంటే పొడుగు గ్యారెంటీ!
Hight Growth
Follow us on

Growth: మానవుని ఎత్తు, చిన్న వయసులో ఆలస్యమవడానికి కారణం ఏమిటనేదానికి అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సమాధానాన్ని కనుగొంది. మనిషి మెదడులో ఉండే ఒక ప్రత్యేక రకం గ్రాహకమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రాహకం మానవులలో శరీర ఎత్తు.. లైంగిక పరిపక్వతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న హార్మోన్లను నియంత్రిస్తుంది. ఈ పరిశోధనలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, వండర్‌బిల్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

మెదడులోని ఈ భాగంలో..

మెదడులోని హైపోథాలమిక్ న్యూరాన్‌ల భాగంలో మెలనోకోర్టిన్-3 రిసెప్టర్ (MC3R) పరిశోధకులు కనుగొన్నారు. ఇది ఎత్తు, లైంగిక పరిపక్వతను నియంత్రిస్తుంది. ఈ గ్రాహకం సరిగ్గా పని చేయనప్పుడు, వ్యక్తి ఎత్తు సరిగ్గా పెరగదు. వ్యక్తులు ఎత్తు తక్కువగా ఉంటారు. అలాగే వారు యువకులుగా మారడానికి ఆలస్యం అవుతుంది.

గ్రాహకానికి సంబంధించిన సమాచారం ఇలా తెలుసుకున్నారు..

అంతర్జాతీయ పరిశోధకుల బృందం 5 లక్షల మందిని పరిశోధనలో చేర్చింది. వారిలో పెరుగుదలకు కారణమైన గ్రహకాలపై పరీక్షలు జరిపారు. MC3R జన్యువులో మార్పు వచ్చిన వేలాది మందిలో 812 మంది మహిళలు పొడవులో తేడా ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు సర్ స్టీఫెన్ ఓ-రైలీ ప్రకారం, మెదడు చేరే పోషకాల ఆధారంగా ఒక వ్యక్తి ఎత్తు, లైంగిక అభివృద్ధిని నిర్ణయిస్తుంది. చాలా ఆలస్యంగా ఎత్తు పెరిగే పిల్లలకు పరిశోధన ఫలితాలు ప్రభావవంతంగా ఉంటాయి.

పరిశోధన నుండి మానవులకు ప్రయోజనం ఏమిటి?

పరిశోధన ఫలితాలు మానవులకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయని పరిశోధకులు నమ్ముతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఔషధాలను తయారు చేయవచ్చు. ఈ ఔషధాలు ఈ గ్రాహకం మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. తద్వారా వ్యక్తి పొడవు ఆగదు. వ్యక్తి కాలక్రమేణా యవ్వనంగా మారవచ్చు.

అమెరికన్ మహిళలు వారికంటే పొడవు ఎక్కువ..

పరిశోధకుల ప్రకారం, US.. UKలలో పురుషుల సగటు ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. అదే సమయంలో, UKలో మహిళల సగటు ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు. అమెరికన్ మహిళల సగటు ఎత్తు UK కంటే కొంచెం ఎక్కువ. ఇక్కడ ఈ సంఖ్య 5 అడుగుల 4 అంగుళాలు.

ఇవి కూడా చదవండి: Google: గూగుల్ వినియోగదారులకు ఈ రూల్ తప్పనిసరి.. లేకుంటే లాగిన్ కావడం కష్టం!

Air Pollution: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వాయుకాలుష్యంతో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ!

JioPhone Next: జియో ఫోన్ నెక్స్ట్ బ్యాటరీ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?