Black Pepper: నల్లమిరియాల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. బరువు తగ్గించడంలో సూపర్..!

|

May 23, 2022 | 6:06 PM

Black Pepper: నల్ల మిరియాలు అనేక రకాల వంటలలో ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. ఔషధ గుణాలతో నిండి ఉంటుంది.

Black Pepper: నల్లమిరియాల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. బరువు తగ్గించడంలో సూపర్..!
Black Pepper
Follow us on

Black Pepper: నల్ల మిరియాలు అనేక రకాల వంటలలో ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక వ్యాధుల చికిత్సకి ఉపయోగిస్తారు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, కె, సి, కాల్షియం, పొటాషియం, సోడియం మొదలైనవి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, బరువు తగ్గించడానికి, కాలానుగుణ అలెర్జీలు, ఆస్తమాతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే దీనిని అనేక విధాలుగా ప్రయత్నించవచ్చు.

1. పానీయాలకి జోడించండి

మీరు పండ్లతో తయారు చేసిన ఆరోగ్యకరమైన పానీయాలకు మిరియాలని కలుపుకోవచ్చు. ఇది పానీయం రుచిని రెట్టింపు చేయడమే కాదు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చర్మంపై మెరుపు తెచ్చేందుకు పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

2. నల్ల మిరియాలు టీ

మీరు బరువు తగ్గాలనుకుంటే నల్ల మిరియాలతో చేసిన టీని తాగవచ్చు. ఇది తయారు చేయడం చాలా సులభం. దీని కోసం మీకు 1/4 స్పూన్ నల్ల మిరియాలు, అల్లం, 1 తేనె, 1 కప్పు నీరు, నిమ్మకాయ అవసరం.

3. నేరుగా తినండి

మీరు ప్రతిరోజూ ఉదయం రెండు నుంచి 3 నల్ల మిరియాలు తినవచ్చు. మీరు దాని ఘాటు లేదా వేడిని ఇష్టపడితే టీలో వేసుకొని తాగవచ్చు.

4. మిరియాలు నూనె

మీరు మార్కెట్ నుంచి 100% స్వచ్ఛమైన నల్ల మిరియాలు నూనెను పొందవచ్చు. ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఈ నూనె చుక్క వేయండి. దానిని తాగండి. ఇది బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది.

5. బరువు తగ్గిస్తుంది

నల్ల మిరియాలలో పైపెరిన్ ఉంటుంది. ఇది కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇది చాలా తక్కువ మొత్తంలో కేలరీలను కలిగి ఉంటుంది. ఇది బరువు పెరగనివ్వదు. ఇది జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో ప్రొటీన్ ఉంటుంది. తిన్న వెంటనే ఆకలి ఉండదు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి