
బొప్పాయి గింజలు చేదుగా, కొంచెం ఘాటుగా (మిరియాల రుచిలో) ఉన్నప్పటికీ, వీటిలో ఉండే జీవక్రియలు (Biological Activity) మనిషి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ‘బెంజైల్ ఐసోథియోసైనేట్’ వంటి రసాయనాలు సహజ రక్షణ వ్యవస్థగా పనిచేస్తాయి. కడుపులోని నులిపురుగులను సంహరించడం నుండి, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడం వరకు ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈ గింజల గురించి చెబుతున్న 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పప్పాయి గింజలతో కలిగే 7 అద్భుత ప్రయోజనాలు:
బ్యాక్టీరియాపై పోరాటం: బొప్పాయి గింజల సారం ఇ.కోలి, సాల్మొనెల్లా వంటి హానికర బ్యాక్టీరియాలను అడ్డుకుంటుంది. వీటిలో ఉండే ‘బెంజైల్ ఐసోథియోసైనేట్’ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది.
పురుగుల నివారణ: ఎండిన పప్పాయి గింజల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు, పరాన్నజీవులు నశిస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది.
శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్: ఈ గింజలలోని వాటర్ ఎక్స్‌ట్రాక్ట్ విటమిన్-సి కంటే వేగంగా పనిచేసి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. ఇది చర్మ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
జీర్ణక్రియకు మేలు: బొప్పాయిలో ఉండే ‘పపైన్’ (Papain) వంటి ఎంజైమ్‌లు ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా అల్సర్లను తగ్గించడంలోనూ తోడ్పడుతుంది.
అమీబియాసిస్ నివారణ: ఎంటమీబా హిస్టోలిటికా వంటి ప్రమాదకర పరాన్నజీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో ఈ గింజలు కీలక పాత్ర పోషిస్తాయి.
కొలెస్ట్రాల్, షుగర్ నియంత్రణ: జంతువులపై చేసిన ప్రయోగాల్లో బొప్పాయి గింజల సారం శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గించినట్లు గుర్తించారు.
క్యాన్సర్ నిరోధక గుణాలు: వీటిలో ఉండే ఐసోథియోసైనేట్స్, లైకోపీన్ ఫెనోలిక్ సమ్మేళనాలు కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రభావితం చేస్తాయని ల్యాబ్ పరీక్షల్లో తేలింది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. వీటిని అతిగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది, కాబట్టి మీ డైట్‌లో చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.