Tata Steel : టాటా స్టీల్స్, జిందాల్ స్టీల్స్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

సెకండ్ వేవ్‌లో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడేందుకు ముందుకు వ‌చ్చినందుకు మీ స‌హ‌కారం మ‌రువ‌లేనిది అని కేసీఆర్ ప్ర‌భుత్వం పేర్కొంది.

Tata Steel : టాటా స్టీల్స్,  జిందాల్ స్టీల్స్ కు  కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
CM KCR

Updated on: May 31, 2021 | 1:03 AM

Tata Steel and Naveen Jindal : టాటా స్టీల్స్, జిందాల్ స్టీల్స్ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. తెలంగాణ ప‌ట్ల‌ ఉదార స్వ‌భావం చాటుకున్న సదరు రెండు సంస్థ‌లు.. మెడిక‌ల్ లిక్విడ్ ఆక్సిజ‌న్‌ను తెలంగాణ‌కు విరాళంగా ఇచ్చాయి. ఈ సంద‌ర్భంగా ఆ రెండు సంస్థ‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ధన్యవాదాలు చెప్పింది. సెకండ్ వేవ్‌లో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడేందుకు ముందుకు వ‌చ్చినందుకు మీ స‌హ‌కారం మ‌రువ‌లేనిది అని కేసీఆర్ ప్ర‌భుత్వం పేర్కొంది. కరోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో తెలంగాణ‌కు అండ‌గా నిలిచినందుకు అభినందిస్తున్నామ‌ని సదరు సంస్థలకు తెలియజేసింది.

Read also : Helplines : నాలుగు హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం, ప్రజలకు తెలియ పర్చాలని టీవీ ఛానళ్లకు వినతి