Health Tips: పంటి నొప్పితో బాధపడుతున్నారా.. ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం పొందండిలా..!

|

Dec 23, 2021 | 9:09 AM

Teeth Care Tips: పంటి నొప్పితో బాధపడుతున్నారా.. అయితే తక్షణ ఉపశమనం పొందగలిగేందుకు కొన్ని ఇంటి చిట్కాలను మీకోసం అందిస్తున్నాం.

Health Tips: పంటి నొప్పితో బాధపడుతున్నారా.. ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం పొందండిలా..!
Sensitive Teeth
Follow us on

Teeth Care Tips: పంటి నొప్పితో ఈరోజుల్లో చాలా ఎక్కువ మంది బాధపడుతున్నారు. నొప్పి మీ దంతాలదే అయినా నోరు, తల, మెడ కూడా నొప్పితో బాధపడుతుంటాయి. పంటి నొప్పి బాధిస్తుంటే ఏమీ తినలేం కూడా. అటువంటి పరిస్థితిలో మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మేము మీకోసం కొన్ని ఇంటి చిట్కాలను అందిస్తున్నాం. వాటిని ఉపయోగించి పంటి నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పంటిలో లవంగాన్ని ఉంచండి- మీకు పంటి నొప్పి ఉంటే, మీ వంటగది నుంచి ఒక లవంగాన్ని తీసుకొని పంటి మధ్యలో ఉంచండి. అయితే ఈ లవంగాన్ని నమలకూడదని గుర్తుంచుకోండి. చప్పరిస్తూ లవంగం రసాన్ని పీల్చుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ నొప్పి కొన్ని నిమిషాల్లో మాయమవుతుంది.

గోరువెచ్చని నీరు- వేడి నీటి వాడకంతో కూడా పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీని కోసం, ఒక గ్లాసు నీటిని తీసుకొని వేడి చేసి, అందులో అర టీస్పూన్ ఉప్పు కలపాలి. ఇప్పుడు ఈ నీటిని కొద్ది కొద్దిగా తీసుకొని పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల 10 నుంచి 15 నిమిషాల్లోనే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

జామ ఆకులు- పంటి నొప్పి వచ్చినప్పుడు జామ చెట్టు చిగురులను వాడితే కూడా మంచి ఉపయోగం ఉంటుంది. ఈ ఆకులను కడిగి శుభ్రం చేసి, నెమ్మదిగా నమలాలి. ఇలా చేయడం వల్ల మీరు పంటి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.

Also Read: Winter: చలికాలం పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి.. లేకంటే ప్లూ, న్యూమోనియా రావొచ్చు..

Benefits of Black Carrot: చలికాలంలో బ్లాక్ క్యారెట్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు..అవేంటో తెలుసా..