
గజ్జల్లో కాని, ఉదరంలో కాని కండరాలు బలహీనపడినప్పుడు, కడుపు లోని కొవ్వు, ప్రేగులు వాటిగుండా బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు బయటికి కనబడే “ఉబ్బు”ను గిలక లేదా హెర్నియా (Hernia) అంటాము. స్త్రీ పురుష అనే భేదం లేకుండా అన్ని వయస్సుల వారికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక పిల్లల్లో కంజెనిటల్ హెర్నియాల సర్వసాధారణం. పురుషుల్లో ఇంగ్వైనల్ హెర్నిన్ సాధారణం. అయితే స్త్రీలలో అంబ్లిక, ఫెమోరల్ హెర్నియాలు అనేవి సాధారణంగా వస్తుంటాయి.
1. గజ్జల్లో వచ్చే హెర్నియా
2. తొడ లోపలి భాగంలో వచ్చే హెర్నియా
3. ఉదర పైభాగంలో వచ్చే హెర్నియా
4. శస్త్రచికిత్స ఐన తరువాత, కొంత కాలానికి, శస్త్రచికిత్సజరిగిన చోట ఏర్పడే హెర్నియా
మీరు ఏ రకమైన హెర్నియాతో బాధపడుతున్నారో మీరు మీ వైద్యుడిని అడిగి తెలుసుకోవాలి. మీకు హెర్నియా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే అన్ని సందేహాలను నివృత్తి చేసుకోవాలి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే శస్త్ర చికిత్స చేయాలి. త్వరగా ఆపరేషన్ చేయకపోతే రోగికి ప్రాణాపాయం కలగవచ్చు.హెర్నియాకు సంబంధించి అస్సలు విస్మరించకూడని 5 క్లిష్ట సంకేతాల గురించి తెలుసుకుందాం.
1. అబ్డామినల్ మజిల్స్ బలహీనంగా మారిపోవడం.
2. అబ్డామిన్ లో ప్రెషర్ ఎక్కువయ్యి ఈ కంటెంట్స్ని బలహీనపడ్డ ప్రదేశంలో నుండి బయటకు తోయడం.
అబ్డామినల్ వాల్ బలహీనం కావడానికి కొన్ని కారణాలుండవచ్చు.
1. పుట్టుకతోనే అలా ఉండి ఉండవచ్చు.
2. ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది.
3. ఎక్కువసార్లు గర్భ ధారణ.
4. సర్జరీ చేసినప్పుడు పెట్టే కోత వల్ల కూడా అవకాశం.
హెర్నియా యొక్క సంకేతాలు, లక్షణాలు గజ్జ లేదా స్క్రోటమ్‌లో వాపు లేదా ఉబ్బడం. వస్తువులను ఎత్తేటప్పుడు నొప్పి, కడుపు నిండిన అనుభూతి, ప్రేగు అవరోధం… ఈ లక్షణాలను అస్సలు తేలికగా తీసుకోకూడదు.
హెర్నియాను నిర్దారించడానికి వైద్యులు శారీరక పరీక్ష చేస్తారు. మీరు డాక్టర్ సూచించిన మార్గదర్శకాలను మాత్రమే అనుసరించాలి. వైద్యుని సలహాలు సూచనలు పాటించనట్లయితే..పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ఎలాంటి పనులు చేయలేరు.
హెర్నియాకి సర్జరీ ద్వారానే చికిత్స చేస్తారు. కేవలం మందులు వాడటం ఈ సమస్య పరిష్కారం కాదు. హెర్నియా సర్జరీలో సాధారణంగా హెర్నియల్ కంటెంట్ ను రెడ్యూస్ చేయడం, డిఫెక్ట్ ను సరిచేయడం, అక్కడ ఒక మెష్ పెట్టడం ద్వారా రీ ఇంఫోర్స్ చేయడం వంటివి ఉంటాయి. ఈ సర్జరీ లాప్రోస్కోపిక్ లేదా ఓపెన్ సర్జరీ ద్వారా చేస్తారు.
హెర్నియా సర్జరీ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా సాధారణ చికిత్సలలో ఒకటి. పొట్టలో కానీ, గజ్జల్లో కానీ గడ్డలా తగిలితే వెంటనే వైద్యుని సంప్రదించండి. సర్జరీ తరువాత కూడా కొన్ని నెలల పాటూ జాగ్రత్తగా ఉండాలి, మరీ ఎక్కువగా అలిసిపోయే పనులు చేయకూడదు. హెర్నియా చికిత్స చేసినప్పుడూ దాని కారణాన్ని కూడా ట్రీట్ చేయకపోయినట్లయతే ఈ సమస్య మళ్ళీ రావచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..