ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగండి.. జబ్బులన్నీ పారిపోతాయి..!

ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో మెంతులు, సోంపు కలిపిన నీరు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. జీర్ణక్రియ బాగుండడం, బరువు తగ్గడం, డయాబెటిస్ కంట్రోల్, చర్మ ఆరోగ్యం మెరుగు వంటి ప్రయోజనాలుంటాయి. రోజూ ఈ ఆరోగ్యకరమైన అలవాటుతో మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగండి.. జబ్బులన్నీ పారిపోతాయి..!
Fennel And Fenugreek Seeds Health Benefits

Updated on: Jul 19, 2025 | 9:52 PM

ప్రతిరోజు హెల్దీగా ఉండాలంటే కొన్ని చిన్న మార్పులు మన లైఫ్‌స్టైల్‌ లో చేసుకోవాలి. అలాంటి మార్పుల్లో ఒకటి ఉదయం ఖాళీ కడుపుతో మెంతులు సోంపు కలిపిన నీరు తాగడం. ఇవి రెండూ మన వంటల్లో నార్మల్‌ గా వాడేవే అయినా.. వీటిలో అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపిన నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు వీటి వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

సోంపులోని పోషకాలు

సోంపు గింజల్లో విటమిన్ C, E, K లాంటి ముఖ్యమైన విటమిన్లు మాత్రమే కాదు.. కాల్షియం, మగ్నీషియం, జింక్, పొటాషియం, ఐరన్ లాంటి మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని వివిధ అవయవాల పనితీరును మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి.

మెంతులతో ప్రయోజనాలు

మెంతులు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ A, C లతో నిండి ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలంగా ఉంచడమే కాకుండా.. డయాబెటిస్ కంట్రోల్‌ కు, చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి.

జీర్ణక్రియ

ఈ నీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను సజావుగా చేస్తుంది. రోజూ ఉదయాన్నే ఈ నీరు తాగడం వల్ల అజీర్ణం, గ్యాస్, ఊబకాయం లాంటి సమస్యలు తగ్గుతాయి.

బరువు తగ్గించే శక్తి

ఈ నీరు తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం, ఎక్కువగా ఫైబర్ ఉండటం వలన ఆకలి వేయకుండా కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. దీని వల్ల ఎక్కువగా తినే అలవాటు తగ్గి.. కొవ్వు కరిగిపోతుంది.

డయాబెటిస్

మెంతులు సహజంగా గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించడంలో సహాయపడతాయి. సోంపుతో కలిపినప్పుడు ఈ నీరు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది బాగా సహాయపడుతుంది.

చెడు కొలెస్ట్రాల్‌

ఈ నీరు LDL అనే చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించి.. గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి ఇది ఒక మంచి హెల్పింగ్ డ్రింక్.

రోగనిరోధక శక్తి

ఈ మిశ్రమంలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన శరీరంలో వ్యాధికారక సూక్ష్మజీవుల మీద పోరాడే శక్తి పెరుగుతుంది. విటమిన్ C, ఐరన్ లాంటి పోషకాల వల్ల ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచవచ్చు.

లివర్ డిటాక్సిఫికేషన్

మెంతులు, సోంపులో ఉన్న ఔషధ గుణాలు లివర్‌ కు సహాయం చేస్తాయి. ఈ నీటిని తాగడం ద్వారా శరీరంలో చేరిన హానికర రసాయనాలను బయటకు పంపించి లివర్‌ ను శుభ్రంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.

హెల్తీ స్కిన్ కోసం..

ఈ నీటిలో యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల మొటిమలు, దురద లాంటి సమస్యలు తగ్గుతాయి. చర్మానికి మృదుత్వం, ప్రకాశం తీసుకువస్తుంది. ఈ విధంగా ఉదయం నార్మల్ నీటికి బదులుగా మెంతులు, సోంపు నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)