వీటిలో విటమిన్లు, ఖనిజాలు బోలెడు..! మీ బాడీకి కావాల్సినవన్నీ ఇందులో ఉంటాయి..!

వేరుశనగలు చిన్నవిగా కనిపించినా అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పుష్కలంగా ఉండే ప్రోటీన్, మంచి కొవ్వులు, విటమిన్లు శరీరానికి కావలసిన శక్తినిస్తాయి. చలికాలంలో కూడా వేడి కోసం, బరువు నియంత్రణ కోసం వేరుశనగలు హెల్తీ స్నాక్‌ లా పని చేస్తాయి.

వీటిలో విటమిన్లు, ఖనిజాలు బోలెడు..! మీ బాడీకి కావాల్సినవన్నీ ఇందులో ఉంటాయి..!
Peanut Health Benefits

Updated on: May 12, 2025 | 8:39 PM

మనం తినే వాటిలో వేరుశనగలు కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి చిన్నగున్నాగానీ, మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. ఊర్లల్లో అయితే ఇవి బాగా దొరికేవి. ఇప్పుడు సిటీలల్లో కూడా చాలా మంది వీటిని హెల్తీ స్నాక్‌ లా తింటున్నారు. అంతేకాదు ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.

వేరుశనగల్లో ప్రోటీన్ బాగా ఉంటుంది. మంచి కొవ్వులు, పీచు పదార్థం, విటమిన్లు, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ లాంటి ఖనిజాలు కూడా చాలా ఎక్కువ. ఇవన్నీ మన బాడీకి కావాల్సిన పోషకాలు. వీటి వల్ల మనకు మంచి ఎనర్జీ వస్తుంది. అంతేకాదు జబ్బులతో కూడా పోరాడే శక్తి పెరుగుతుంది.

వేరుశనగల్లో మోనోశాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతాయి. ఈ కొవ్వుల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఇది వయోవృద్ధులకే కాక యువతకు కూడా మంచిది.

చలికాలంలో వేరుశనగలు తినడం ద్వారా శరీరం వెచ్చగా మారుతుంది. ఎందుకంటే వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఇలా వేడి ఉత్పత్తి కావడం వల్ల చలి నుంచి రక్షణ లభిస్తుంది. శరీరంపై చలికాల ప్రభావం తక్కువగా ఉంటుంది.

వేరుశనగలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు నియంత్రణలో సహాయపడుతాయి. ఎక్కువసేపు ఆకలి అనిపించకుండా చేస్తాయి. దీని వల్ల అనవసరమైన తిండిని నివారించవచ్చు. దీనివల్ల బరువు పెరగడం వంటి సమస్యలు తగ్గిపోతాయి. బరువు నియంత్రణ కోరుకునే వారికి ఇది ఉత్తమమైన ఆహారం.

విటమిన్-ఇ, విటమిన్-బి6, నయాసిన్, ఫోలేట్ వంటి విటమిన్లు, మెగ్నీషియం, జింక్ లాంటి ఖనిజాలు వేరుశనగలలో ఉంటాయి. ఇవి చర్మానికి మంచిగా పని చేస్తాయి. నరాలు, ఎముకలు బలపడుతాయి. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. రోజూ కొద్దిగా వేరుశనగలు తీసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా పని బరువు ఎక్కువగా ఉన్నప్పుడు వేరుశనగలు తినడం శక్తిని అందిస్తుంది. మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు శక్తినిస్తాయి. వ్యాయామం చేసే వారికి ఇది మంచి శక్తివంతమైన ఆహారం. వేరుశనగలు చిన్నవి అయినా శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి నిత్యం ఆహారంలో భాగం చేస్తే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.