Summer Health Tips: జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా? అయితే, ఇలా చేయండి..!

|

Mar 19, 2022 | 6:10 PM

Health Tips: వాతావరణంలో మార్పు మొదలయ్యాయి. పగటిపూట ఎండలు మండుతున్నాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల కారణంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు.

Summer Health Tips: జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా? అయితే, ఇలా చేయండి..!
Health Tips
Follow us on

Health Tips: వాతావరణంలో మార్పు మొదలయ్యాయి. పగటిపూట ఎండలు మండుతున్నాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల కారణంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం సహా ఇతర వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల కారణంగా అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే.. ఆహారంపై శ్రద్ధ వహించాలని, పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలు.. జ్వరం, తదితర సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. అయితే, ఈ లక్షణాలను జనాలు కరోనాగా భావిస్తున్నారని పేర్కొన్నారు. జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన వారిలో ఎవరికీ కరోనా పాజిటివ్ తేలడం లేదని, కేవలం వాతావరణ మార్పుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోందని చెబుతున్నారు వైద్యులు. 100 లో ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వస్తోందన్నారు. జలుబు, దగ్గుతో బాధపడేవారు తమకు కరోనా సోకినట్లుగా భావించాల్సిన అవసరం లేదంటున్నారు. సీజన్ వ్యాధులను ఎదుర్కొనేందుకు సరైన ఆహారం, పరిశుభ్రంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.

సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి వీటిని పాటించండి..
1. బయటకు వెళ్తే దుమ్ము, దూళి నుంచి సురక్షితంగా ఉండేందుకు మాస్క్ వినియోగించండి.
2. పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి. బయట తినకుండా ఉండండి.
3. తేలికపాటి జ్వరం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
4. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవలి.
5. ఒక వ్యక్తికి దగ్గు, జలుబు ఉంటే వారికి దూరంగా ఉండండి.
6. ఎక్కువ పండ్లు, కూరగాయలు తినండి.
7. విటమిన్ డి తీసుకోండి. ఉదయం సమయంలో సూర్యరశ్మి తగిలేలా కాసేపు ఎండకు ఉండండి.
8. సీజన్ ప్రకారం తినే ఆహారాన్ని మార్చండి.
9. ప్రతి రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయండి.

Also read:

Beauty Tips: వేసవిలో ముఖం మెరుపును కోల్పోయిందా?. అయితే ఈ ఆరెంజ్‌ ఫేషియల్‌ మీకోసమే..

Telangana Weather Report: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల కురిసిన వర్షం..

Japan PM Tour: జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు భారత్‌‌లో ఘనస్వాగతం.. ప్రధాని మోడీతో కీలక ద్వైపాక్షిక చర్చలు