ప్రస్తుత కాలంలో డయాబెటీస్ కేసుల సంఖ్య అనేది పెరుగుతూనే ఉంది. ఇతర దేశాలతో పోల్చితే భారత దేశంలో ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా షుగర్ అనేది పెరుగుతుంది. డయాబెటీస్ అనేది జీవితంలో ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం బాధ పడుతూనే ఉండాలి. అలాగే మీరు తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండటం వల్ల కూడా షుగర్ వ్యాధి వస్తుంది. అధిక జీఐ ఉన్న ఆహారాలు తినడం వల్ల కూడా మధుమేహం ఎటాక్ చేస్తుంది. కాబట్టి షుగర్‌ను కంట్రోల్ చేయాలంటే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాలి. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూడండి.
షుగర్ వ్యాధితో బాధ పడేవారు ఎప్పుడూ శుద్ధి చేసిన ధాన్యాలు తీసుకోడం చాలా మంచిది. ఇందులో ఫైబర్‌తో పాటు ఇతర పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్త ప్రవాహంలోని చక్కెర స్థాయులను కంట్రోల్ చేస్తాయి.
డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో కాయ ధాన్యలు ఎంతో చక్కగా సహాయ పడతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్‌తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. ఇవి తక్కువగా తిన్నా కడుపు నిండిన భావన ఉంటుంది. అలాగే ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి.
రక్తంలోని డయాబెటీస్ లెవల్స్‌ను తగ్గించడంలో గుడ్ ఫ్యాట్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఆవకాడో, నట్స్, సీడ్స్, ఆలి్ ఆయిల్ వంటి వాటిల్లో మంచి కొవ్వులు ఎక్కువగా లభిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను వేగంగా తగ్గిస్తాయి. అంతే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.
డయాబెటీస్‌తో బాధ పడేవారు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి. గ్రీక్, యోగర్ట్, టోఫు, పన్నీర్, చికెన్, గుడ్లు, కాయ ధాన్యాల్లో వంటి వాటిల్లో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
పిండి పదార్థాలు తక్కువగా ఉన్న కూరగాయలు, ఆకు కూరలు, బ్రోకలీ, కాలీ ఫ్లవర్, మిరియాలు వంటి వాటితో పాటు ఫైబర్ రిచ్ ఫుడ్స్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు గణనీయంగా కంట్రోల్ అవుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి