AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Benfits: TEA ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఛాయ్ తాగితే మీ లైఫ్ టైమ్ పెరిగినట్లే.. కానీ షరతులు వర్తిస్తాయి..

టీ పేరు చెప్తే చాలు కొంతమంది వ్యక్తుల్లో ఓ ఉత్సాహం.. రోజుకు ఎన్ని సార్లైనా టీ తాగే వాళ్లుంటారు. ఎక్కడైనా టీ కనిపిస్తే చాటు.. వెంటనే తాగేస్తారు. ఉదయం, సాయంత్రం ఎప్పుడైనా సరే టైంతో సంబంధం ఉండదు. అలా ఎక్కువసార్లు టీ

Tea Benfits: TEA ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఛాయ్ తాగితే మీ లైఫ్ టైమ్ పెరిగినట్లే.. కానీ షరతులు వర్తిస్తాయి..
Black Tea
Amarnadh Daneti
|

Updated on: Sep 03, 2022 | 9:59 AM

Share

టీ పేరు చెప్తే చాలు కొంతమంది వ్యక్తుల్లో ఓ ఉత్సాహం.. రోజుకు ఎన్ని సార్లైనా టీ తాగే వాళ్లుంటారు. ఎక్కడైనా టీ కనిపిస్తే చాటు.. వెంటనే తాగేస్తారు. ఉదయం, సాయంత్రం ఎప్పుడైనా సరే టైంతో సంబంధం ఉండదు. అలా ఎక్కువసార్లు టీ తాగే వారిని తిడుతూ ఉంటుంటారు ఇంట్లో వాళ్లు. టీ ఎక్కువ సార్లు తాగడం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువుగా టైమ్ సెన్స్ లేకుండా టీ తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని అనేక అధ్యయనాల్లో తేలింది. కాని ఇప్పుడు టీ తాగితే లైఫ్ టైం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇక్కడే ఓట్విస్ట్ ఉంది. అదీ ఏ టీ పడితే ఆ టీకాదు. దానికి కొన్ని షరుతులు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం. ఇది ఓ రకంగా టీ ప్రేమికులకు ఊరటనిచ్చే విషయమే, ప్రతిరోజూ రెండు కప్పుల టీ తాగేవారు ఎక్కువ జీవించే అవకాశముందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కానీ అది బ్లాక్ టీ మాత్రమే. ప్రతి రోజూ బ్లాక్ టీ తాగే వారికి జీవిత కాలం పెరుగుతుందని శాస్త్రీయ అధ్యయనంలో తేలింది.

అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. టీ తాగని వారితో పోలిస్తే.. ప్రతి రోజు రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు బ్లాక్ టీ తాగేవారి మరణాల ప్రమాదం 9 నుంచి 13 శాతం తక్కువగా ఉందని తేలింది. అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ కి చెందిన మాకి ఇనౌ-చోయ్‌తో సహా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. బ్లాక్ టీ ఎక్కువ స్థాయిలో తీసుకున్నప్పటికీ.. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చని కనుగొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీ తాగేవారి సంఖ్య చాలా ఎక్కువుగానే ఉంది. చాలా దేశాల్లో బ్లాక్ టీ తాగేవారి సంఖ్య మోస్తరుగానే ఉంది. అధ్యయనం కోసం.. పరిశోధన బృందం యూకే బయోబ్యాంక్ నుంచి డేటాను ఉపయోగించి.. అన్ని కారణాలు, నిర్దిష్ట మరణాలతో టీ వినియోగం అనుబంధాలను అంచనా వేసింది. ఈ అధ్యయనం కోసం Uk బయోబ్యాంక్‌ నుంచి.. 2006 – 2010 మధ్య లోతైన జన్యు, ఆరోగ్య సమాచారాన్ని తీసుకున్నారు. దాని నుంచి తయారు చేసిన ప్రశ్నాప్రతాన్ని.. 40 నుంచి 69 సంవత్సరాల వయస్సు గల దాదాపు 5లక్షల మంది పురుషులు, స్త్రీలకు ఇచ్చి వారి నుంచి సమాచారాన్ని సేకరించారు. వీరిలో 85 శాతం మంది రెగ్యులర్‌గా టీ తాగుతున్నారని.. వారిలో 89 శాతం మంది బ్లాక్ టీ తాగుతున్నారని పేర్కొన్నారు.

ఈఅధ్యయనం ప్రకారం, పాలు లేదా చక్కెర వేసుకుని టీ తాగే వారికి ఆరోగ్య ప్రయోజనాలలో గణనీయమైన మార్పులేమి లేవని తెలిపారు. తమ పరిశోధనలు ఇప్పటికే ప్రతిరోజూ టీ తాగే వ్యక్తులకు సంబంధించనదని, ఈఅధ్యయనం ప్రకారం ప్రజలు టీ తాగడం ప్రారంభించాలా లేదా ప్రస్తుతం తాగుతున్న పరిమాణాన్ని మార్చాలా అనే దానిపై తాము ఎటువంటి సిఫార్సు చేయబోమని, ఇది పూర్తిగా వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్చపై ఆధారపడి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. టీ తీసుకోవడం వల్ల మరణాలు తగ్గుతాయని ఈ అధ్యయనం రుజువు చేయలేదని.. ప్రస్తుతం టీ తాగుతూ ఉంటే.. ముఖ్యంగా బ్లాక్ టీ తాగుతూ ఉంటే.. దానిని కంటిన్యూ చేయడంలో ఎటువంటి తప్పులేదని మాత్రమే తమ అధ్యయన నివేదిక వెల్లడిస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..