Heart Disease: మీకు ఎక్కువ సేపు టీవీ చూసే అలవాటు ఉందా..? గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.. అధ్యయనంలో కీలక విషయాలు

|

May 28, 2022 | 8:47 AM

Heart Disease: ప్రతి ఒక్కరు వినోదం కోసం టీవీల ముందు వాలిపోతుంటారు. కానీ మీరు ఒకే చోట కూర్చొని టీవీకి అతుక్కుపోతే, ఈ అలవాటు మీకు ప్రమాదకరంగా మారవచ్చు..

Heart Disease: మీకు ఎక్కువ సేపు టీవీ చూసే అలవాటు ఉందా..? గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.. అధ్యయనంలో కీలక విషయాలు
Heart Health
Follow us on

Heart Disease: ప్రతి ఒక్కరు వినోదం కోసం టీవీల ముందు వాలిపోతుంటారు. కానీ మీరు ఒకే చోట కూర్చొని టీవీకి అతుక్కుపోతే, ఈ అలవాటు మీకు ప్రమాదకరంగా మారవచ్చు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ అధ్యయనం తర్వాత ప్రజలు నిరంతరం టీవీ చూసే అలవాటును మానుకుంటే కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు. రోజుకు నాలుగు గంటల కంటే ఎక్కువసేపు టెలివిజన్ చూసే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

అదే సమయంలో రెండు మూడు గంటల పాటు టీవీ చూసేవారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం నాలుగు గంటల పాటు చూసే వారితో పోలిస్తే 6 శాతం వరకు తక్కువగా ఉంటుందని పరిశోధుకలు చెబుతున్నారు. ప్రజలు ఒక గంట కంటే తక్కువ సమయం టీవీ చూస్తే, వారు కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని 16 శాతం తగ్గించవచ్చు. మీరు ఎక్కువసేపు టీవీ చూసే వ్యసనాన్ని వదులుకోలేకపోతే కనీసం మధ్యలో లేచి నడవడం, కొంత సేపు విరామం ఇవ్వడం లాంటివి చేయాలంటున్నారు.

ఊబకాయం: ఊబకాయం నేరుగా గుండె జబ్బులకు సంబంధించినది. మీరు అధిక బరువు కలిగి ఉంటే వెంటనే దానిని తగ్గించడానికి ప్రయత్నించండి. స్థూలకాయులకు అధిక బీపీ, అధిక కొలెస్ట్రాల్, గుండెకు సంబంధించిన అన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఒత్తిడి: మీరు ఎక్కువగా ఒత్తిడికి గురైతే అది హై బీపీ, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. మరోవైపు ఎక్కువ సిగరెట్‌లు తాగే వ్యక్తులకు కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఆల్కహాల్: ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల మీ బరువు పెరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో గుండె సమస్యల ప్రమాదం పెరుగుతుంది. నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల కూడా అవే పరిస్థితులు ఎదురవుతున్నాయి.

వర్కవుట్ లేదు: మీరు ఎలాంటి వర్కౌట్ చేయకపోతే గుండెకు సంబంధించిన అన్ని సమస్యలు చుట్టుముడుతాయి. అందుకే రోజూ కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఉత్తమం.

స్పైసీ ఫుడ్: కారంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినే అలవాటు మీకు ఉన్నట్లయితే, అలాగే ఇంట్లో ఎక్కువగా కారంగా ఉండే పదార్థాలను తినడానికి ఇష్టపడితే మీకే ఇబ్బంది ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. ఇది అధిక BP, అన్ని గుండె జబ్బులకు బాధ్యత వహిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి