
భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం అస్సలు చేయకూడదు. అలాగే ఎప్పటికప్పుడు ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. తినేటప్పుడు ఆహారాన్ని బాగా నమలాలి.. దాని రుచిని ఆస్వాదించాలి. తొందరగా తినకుండా నెమ్మదిగా తింటే శరీరానికి సహజంగా మేలు జరుగుతుంది.
పాలు తాగే విషయంలో మామూలు పాలు కాకుండా.. కొవ్వు తక్కువగా ఉండే స్కిమ్డ్ మిల్క్ లేదా స్కిమ్డ్ సూప్ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది. వేయించిన, ఎక్కువ నూనె ఉన్న ఆహారాలను పూర్తిగా మానేయాలి.
భోజనానికి సంబంధం లేని సమయాల్లో.. టీవీ చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ లేదా పుస్తకం చదువుతూ అనవసరంగా ఏదైనా తినకూడదు. ఇలాంటి అలవాట్లు దాహాన్ని ఆకలిగా అనిపించి మీకు తెలియకుండానే ఎక్కువ కేలరీలు శరీరంలోకి చేరేలా చేస్తాయి.
శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే కూల్ డ్రింక్స్, తీపి కలిపిన బాటిల్ జ్యూస్ లు, ఎక్కువ కాఫీ, టీ తాగడం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. వీటికి బదులుగా ఎక్కువ నీరు తాగాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అవసరమైతే ఇంట్లో తయారు చేసుకునే తాజా పండ్ల రసాలు తీసుకోవచ్చు.
శరీరానికి హాని కలిగించే పదార్థాల్లో జీడిపప్పు, బాదం, వేరుశెనగ వంటివి ఎక్కువగా తినకూడదు.. ఇవి మంచివే అయినా ఎక్కువ తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. అంతే కాదు బేకరీ ఐటమ్స్, స్వీట్లు, చాక్లెట్లు వంటి ఎక్కువ చక్కెర పదార్థాలు పూర్తిగా తగ్గించాలి.
అలాగే నెలకోసారి బరువు చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఎత్తుకు తగ్గ శరీర బరువు ఎంత ఉండాలో తెలుసుకొని.. దాని ప్రకారమే లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగాలి.
ఇది కేవలం బరువు తగ్గడం కోసమే కాదు.. ఆరోగ్యంగా జీవించడానికి కూడా ఉపయోగపడే మార్గం. శరీరానికి శ్రమతో పాటు, మనసు ప్రశాంతంగా ఉండటానికి మంచి జీవనశైలి అవసరం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)