Sleep Side Effects: తగినంత నిద్ర ఉండట్లేదా.? అయితే మీరు ఈ 3 వ్యాధుల బారిన పడినట్లే.!

|

Mar 07, 2022 | 8:25 PM

పౌష్టికాహారం తినడమే కాదు.. కంటి నిండా నిద్ర కూడా ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యకరంగా ఉండగలం. ప్రతీ రోజూ కనీసం...

Sleep Side Effects: తగినంత నిద్ర ఉండట్లేదా.? అయితే మీరు ఈ 3 వ్యాధుల బారిన పడినట్లే.!
Sleep Side Effects
Follow us on

పౌష్టికాహారం తినడమే కాదు.. కంటి నిండా నిద్ర కూడా ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యకరంగా ఉండగలం. ప్రతీ రోజూ కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర.. శారీరికంగా, మానసికంగా మనకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది శరీర పని సామర్థ్యాన్ని కాపాడుతుంది. మీకు తగినంత నిద్ర లేకపోతే.. ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఊహించారా.? నిద్రపోకపోవడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా.? ఇది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు భిన్నమైన పరిశోధనలు చేశారు. అసంపూర్ణ నిద్ర శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని తేల్చారు.

తగినంత నిద్ర లేకపోవడం వల్ల ప్రత్యక్ష ప్రభావం కళ్లపై కనిపిస్తుంది. శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. అంతేకాదు దాని ప్రభావం ముఖంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితంగా, కళ్ల కింద వాపు లేదా నల్ల మచ్చలు వస్తాయి. సైన్స్ ఫోకస్ నివేదిక ప్రకారం, ఒక వ్యక్తికి తగినంత నిద్ర లేకపోతే అతని మెదడుపై ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారు. తగినంత నిద్ర లేకపోతే.. ప్రత్యక్షంగా ఆ ఎఫెక్ట్ మనిషి మెదడుపై పడుతుంది. ఫలితంగా, ఆ వ్యక్తి ఎప్పుడూ చిరాకు పడుతుంటాడు.

నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్ల స్థాయి పెరుగుతుందని నివేదిక చెబుతోంది. ఒకవేళ ఇలా జరిగితే.. రక్తపోటు పెరగడమే కాదు.. శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గడంతో పాటు జీవక్రియపై ప్రభావం పడుతుంది. ఫలితంగా, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది, కాబట్టి రోజూ 6 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరి. అసంపూర్తిగా నిద్రపోవడం వల్ల శరీరంలో అపాటైట్ హార్మోన్ గ్రెలిన్ స్థాయి పెరుగుతుంది. అలాంటి స్థితిలో, నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తి.. తన ఆకలి కంటే 25 శాతం ఎక్కువ ఆహారం తీసుకుంటాడు. ఫలితంగా ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. మీరు తగినంత నిద్రపోకపోతే, టైప్-2 మధుమేహం వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉంది. తగినంత నిద్ర లేకపోవడం.. శరీరం బాగా అలసిపోయినట్లు ఉంటే.. గ్లూకోజ్ స్థాయి, జీవక్రియ తగ్గుతుంది. ఫలితంగా టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.