Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping Tips: ఇలా నిద్రపోతే ఎసిడిటీ, మెడ, వెన్నునొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.. వివరాలు మీకోసం..

Sleeping Tips: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. సరిపడ గంటలు నిద్రపోతే.. ఒత్తిడి, అలసట దూరమై ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ తక్కువగా నిద్రపోతే మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది.

Sleeping Tips: ఇలా నిద్రపోతే ఎసిడిటీ, మెడ, వెన్నునొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.. వివరాలు మీకోసం..
Sleeping
Follow us
Shiva Prajapati

|

Updated on: May 02, 2022 | 7:20 AM

Sleeping Tips: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. సరిపడ గంటలు నిద్రపోతే.. ఒత్తిడి, అలసట దూరమై ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ తక్కువగా నిద్రపోతే మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. అలసల, ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే, మంచి నిద్రతో పాటు.. నిద్రపోయే విధానం కూడా ఆరోగ్యం ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బోర్లా పడుకోవడం, ఒకసైడ్ పడుకోవడం, వెల్లకిలా పడుకోవడం వంటి అనేకరకాల భంగిమల్లో నిద్రపోతుంటారు. కొందరు రాత్రి పడుకునే ముందు ఎలా పడుకుంటారో.. మళ్లీ లేచేంత వరకు కూడా అదే పొజీషన్‌లో ఉంటారు. మరికొందరు శారీరక సమస్యల కారణంగా నిద్రపట్టక అటూ ఇటూ మెసులుతుంటారు. చాలా మంది వెన్ను నొప్పి, మెడ నొప్పి, అసిడిటీ కారణంగా నిద్రపట్టక ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వైద్యం తీసుకోవచ్చు. అయితే, శాస్త్రీయ పద్దతుల ద్వారా కూడా వీటిని అధిగమించొచ్చు. మనం నిద్రపోయే పొజిషన్స్ కూడా మన శారీరక సమస్యలను తొలగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏ సమస్యకు ఎలా నిద్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మెడ నొప్పి.. మెడనొప్పి ఉన్నవారు వెల్లకిగా లేదా, పక్కకు పడుకోవాలి. అలాగే, మెడ కింద చిన్నపాటి దిండు పెట్టుకోవాలి.

వెన్నునొప్పి.. వెన్నునొప్పి కారణంగా చాలా మంది నిద్రపోలేరు. అలాంటి సమయంలో వెల్లకిగా పడుకోవాలి. మీ మోకాళ్ల కింద దిండు పెట్టుకోవాలి. ఇంకా అసౌకర్యంగా ఉంటే.. ఒక టవల్‌ని రోల్ చేసి నడుము కింద ఉంచి కాసేపు పడుకోవాలి.

అసిడిటీ సమస్యతో ఉన్నప్పుడు.. కారం పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు అసిడిటీ సమస్య తలెత్తుతుంది. రాత్రిపూట అసిడిటీ సమస్య ఉత్పన్నమైతే.. నిద్రపట్టక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే పడుకునేప్పుడు తలకింద ఎత్తైన దిండు పెట్టుకోవాలి. ఒక వైపునకు నిద్రించాలి.

భుజం నొప్పి.. భుజం నొప్పి కూడా నిద్రకు భంగం కలిగిస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే భుజం నొప్పి ఉన్నవైపు నిద్రపోవద్దు. వెల్లకిలా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఒకవైపు పడుకోవాలనుకుంటే మాత్రం దిండును ఉపయోగించండి.

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలపై ఆధారపడి ఉంది. TV9 హిందీ వాటిని ధృవీకరించలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)

Also read:

Child care tip: వేసవిలో పిల్లల శరీరం చల్లగా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి..!

Viral Video: ఒక్క నీటి చుక్క నిండు ప్రాణాలను కాపాడింది.. గుండెను పిండేస్తున్న వీడియో..!

Trs vs Bjp: బండి సంజయ్‌కి నిజంగా ప్రేమ ఉంటే ఆ పని చేయాలి.. మంత్రి కేటీఆర్ డిమాండ్..