Hyderabad Skin Bank: తెలుగు రాష్ట్రాల్లో తొలి చర్మ బ్యాంకుకు శ్రీకారం.. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక చికిత్స

|

Jun 29, 2021 | 6:48 PM

మొదటి సారి స్కిన్ బ్యాంక్ గురించి తెలుసుకోబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి స్కిన్ బ్యాంక్ ఉస్మానియా ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చింది.

Hyderabad Skin Bank: తెలుగు రాష్ట్రాల్లో తొలి చర్మ బ్యాంకుకు శ్రీకారం.. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక చికిత్స
Skin Bank Now In Hyderabad Osmania General Hospital
Follow us on

Skin bank in Osmania General Hospital: మనం ఇప్పటి వరకూ ఐ బ్యాంక్ చూశాం.. బ్లడ్ బ్యాంక్ చూశాం.. చివరకు ఫుడ్ బ్యాంక్ కూడా విన్నాం.. కానీ మొదటి సారి స్కిన్ బ్యాంక్ గురించి తెలుసుకోబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి స్కిన్ బ్యాంక్ ఉస్మానియా ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చింది.

హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఏర్పాటైన తెలంగాణలోని తొలి స్కిన్‌ బ్యాంకును సోమవారం హోం మంత్రి మహమూద్‌ అలీ, హెటిరో చైర్మన్‌ డాక్టర్‌ బీపీఎస్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. రూ.60 లక్షల వ్యయంతో హెటిరో డ్రగ్స్‌ లిమిటెడ్‌, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఈస్ట్‌ సహకారంతో ఆసుపత్రిలోని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో ఈ స్కిన్‌ బ్యాంకును ఏర్పాటు చేశారు.

శరీరం కాలితే.. ప్రోటీన్లు, ఫ్లూయిడ్స్ ఎక్కువగా లాస్ అవుతాయి. అలాంటి గాయాలకు డ్రెస్సింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగని చికిత్స చేయకుండా వదిలేస్తే.. నొప్పిగా ఉంటుంది. పైగా ఎండను తట్టుకోలేరు. ఇలాంటి వారి కోసం అత్యాధునిక పద్ధతుల్లో చికిత్స అందించేందుకు చారిత్ర్మాక ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సిద్ధమవుతోంది. అలాంటి వారి కోసమే స్కిన్ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చినట్టు ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేందర్ తెలిపారు. 40 శాతానికి పైగా కాలిన గాయాలకు స్కిన్ బ్యాంక్‌లో చికిత్స చేస్తామన్నారు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా స్కిన్ అతికించవచ్చు. అందవిహీనంగా తయారైన చర్మాన్ని.. సర్జరీ చేసి నార్మల్ కండీషన్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. కేవలం హెపటైటిస్‌, హెచ్‌ఐవి టెస్టులు చేసి స్కిన్ తీసుకుంటారు. 5 సంవత్సరాల వరకూ చర్మాన్ని.. బ్యాంక్‌లో స్టోర్ చేయవచ్చని నాగేందర్ వెల్లడించారు.

ఈ కాలం యువతీ, యువకులు.. అందం, శరీర సౌందర్యం మీద ప్రత్యేక దృష్టి పెడతారు. అందంగా కనిపించేందుకు మేక్ ఓవర్లు.. అనేక చిట్కాలు పాటిస్తుంటారు. కానీ, అనుకోని ఘటనలు జరిగి శరీరం కాలిపోయినా.. పెద్ద, పెద్ద గాయాలైనా.. వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమాజంలోకి రావాలన్నా చాలా మంది జంకుతుంటారు. అలాంటి వాళ్ల కోసం స్కిన్ బ్యాంక్ చాలా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read Also… Land Registration Value: తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలి.. ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు