
తలనొప్పి అనేది చిన్న సమస్యగా అనిపించినా ఒకసారి వస్తే రోజంతా అసహనంగా అనిపిస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువ సేపు మొబైల్ లేదా టీవీ చూడటం, ఆకలికి తినకపోవడం వంటి కారణాల వల్ల తలనొప్పి రావచ్చు. టాబ్లెట్లు వాడకుండానే సహజమైన మార్గాల్లో తలనొప్పిని తగ్గించుకునే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే టాబ్లెట్లు వేసుకోకుండా ఇంట్లోనే సహజమైన చికిత్సను ప్రయత్నించొచ్చు. రెండు ఐస్ క్యూబ్స్ తీసుకుని వాటిని ఒక చిన్న ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత బొటనవేళ్లను ఈ ఐస్ ముక్కలపై ఉంచి కాసేపు అయ్యాక తీసి మెల్లగా మసాజ్ చేయాలి. ఇలా రెండు నిమిషాల పాటు చేస్తే తలనొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
మన బొటనవేళ్ల నరాలు నేరుగా తల నరాలతో కనెక్ట్ అయి ఉంటాయి. ఐస్ చల్లదనంతో నరాల ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగవడంతో తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా సహజమైన చికిత్స కనుక ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇతర సహజమైన మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ఈ చిట్కాలను పాటించడం వల్ల తలనొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు. మీకు తలనొప్పి అనిపించినప్పుడు ఒకసారి ఐస్ మసాజ్ ప్రయత్నించి చూడండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)