Travelling ప్రయాణాలు చేయడం మీకు ఇష్టమా.. ఈ సింపుల్ టిప్స్ తో మీ ట్రావెలింగ్ ను మధురానుభూతిగా మార్చుకోండి

|

Jul 09, 2022 | 7:05 AM

ప్రయాణాలనేవి మనకు ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తాయి. ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి అక్కడి ప్రాంతాలను మనసారా ఆస్వాదిస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. పని ఒత్తిడితో విసిగిపోయి....

Travelling ప్రయాణాలు చేయడం మీకు ఇష్టమా.. ఈ సింపుల్ టిప్స్ తో మీ ట్రావెలింగ్ ను మధురానుభూతిగా మార్చుకోండి
Travel Tips
Follow us on

ప్రయాణాలనేవి మనకు ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తాయి. ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి అక్కడి ప్రాంతాలను మనసారా ఆస్వాదిస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. పని ఒత్తిడితో విసిగిపోయి ఉన్న వారికి ఈ విహార యాత్రలు, ప్రయాణాలు ఎంతో ఊరట కలిగిస్తాయి. అయితే ఎంత ఇష్టమైన ప్రయాణమైనా కొన్ని సార్లు విసుగు కలిగిస్తుంది. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఇందుకు కారణం కావచ్చు. వీటిని కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు. ప్రయాణాల్లో ముఖ్యంగా మనం ఫిట్ గా ఉండాలి. ఎందుకంటే ప్రయాణం చేసే సమయంలో కొన్ని సార్లు మనం మన శక్తికి మించి కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి బాడీ ఫిట్ గా ఉండేందుకు వ్యాయామం చేయడం తప్పనిసరి. సాధారణంగా చాలా మంది ఉదయం టిఫిన్ చేయడం మానేస్తూ ఉంటారు. అయితే అలా చేయడం చాలా తప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం అల్పాహారం తినడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు.

ప్రయాణాల్లో నిద్ర వచ్చేలా చేసే ఆహార పదార్థాలను తినవద్దు.నట్స్, పండ్లు బాడీలోని జీవక్రియను పెంచి చురుగ్గా ఉండేలా చేస్తుంది. సాధారణంగా ప్రయాణంలో తక్కువ నీరు తాగుతారు. అయితే వేడి అధికంగా ఉండే ప్రాంతాలకు వెళుతున్నట్లయితే ఎక్కువ నీరు త్రాగడం మంచిది. ప్రయాణంలో ఎక్కువగా తినడానికి బదులుగా, ప్రోటీన్ బార్లను తినండి. ఇది శక్తిని ఇస్తుంది. సాయంత్రం వేళల్లో వీలైతే మీరు బస చేసే హోటళ్లలోని జిమ్‌ కు వెళ్లడం ఉత్తమం. ఎక్కడ ఉన్నా, టాక్సీలలో ప్రయాణించే బదులు, సమీపంలోని ప్రదేశాలకు నడిచి వెళ్లేందుకు ప్రాధాన్యత ఇవ్వంి. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే మీ ప్రయాణం జీవితంలో మధురానుభూతిగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.