Winter: చలికి చర్మం పగులుతోందా.. స్కిన్‌ను మృదువుగా చేసుకునే టిప్స్ మీకోసం!

చలికాలం వచ్చిందంటే చాలు… చేతులు, కాళ్లు, ముఖం, పెదవులు – ఎక్కడ చూసినా పగుళ్లు, ఒళ్లు బొబ్బ, దురద! మార్కెట్లో లభించే మాశ్చరైజర్లు, క్రీమ్‌లు రాస్తే ఒక్క రోజు మాత్రమే రిలీఫ్, మళ్లీ తిరిగి అదే సమస్య రిపీట్​ అవుతుంది. చలికాలంలో ఉష్ణోగ్రత ..

Winter: చలికి చర్మం పగులుతోందా.. స్కిన్‌ను మృదువుగా చేసుకునే టిప్స్ మీకోసం!
Dryskin

Updated on: Dec 02, 2025 | 6:00 AM

చలికాలం వచ్చిందంటే చాలు… చేతులు, కాళ్లు, ముఖం, పెదవులు – ఎక్కడ చూసినా పగుళ్లు, ఒళ్లు బొబ్బ, దురద! మార్కెట్లో లభించే మాశ్చరైజర్లు, క్రీమ్‌లు రాస్తే ఒక్క రోజు మాత్రమే రిలీఫ్, మళ్లీ తిరిగి అదే సమస్య రిపీట్​ అవుతుంది. చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గడం, తేమ తగ్గిపోవడం వల్ల చర్మం పొడిబారి, పగుల్లు పడుతూ ఎర్రగా, దురదగా మారిపోతుంది.

ముఖ్యంగా చేతులు, పాదాలు, పెదాలు, మోకాళ్లు దీనివల్ల ఎక్కువగా ప్రభావితం అవుతాయి. చిన్న పగుళ్లతో మొదలై లోతైన గాట్లు, రక్తం కారడం వరకూ వెళ్తే అసౌకర్యం, ఇన్ఫెక్షన్ భయం కూడా పొంచి ఉంటుంది. అయితే ఇది అనారోగ్యం కాదు, సరైన సంరక్షణతో ఈ సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. ఇంట్లో ఉండే వస్తువులతోనే చర్మాన్ని మృదువుగా ఎలా మార్చవచ్చో తెలుసుకుందాం..

  • ఒక టీస్పూన్​ చొప్పున ఆలివ్​ ఆయిల్​, తేనె, అలోవెరా జెల్​ని ఒక గిన్నెలో తీసుకుని బాగా కలిపి రాత్రి ముఖం, చేతులు, కాళ్లపై రాసి బాగా మర్దన చేయాలి. ఉదయాన్నే స్నానం చేస్తే చర్మం మృదువుగా మెరుస్తుంది.
  • రెండు టేబుల్​ స్పూన్ల షియా బట్టర్‌ను డబుల్ బాయిలర్‌ పద్దతిలో కరిగించి, ఒక టేబుల్​ స్పూన్​ కొబ్బరి నూనె, రెండు విటమిన్​ E టాబెట్లు వేసి బాగా కలిపి చల్లార్చాలి. ఒక గాజు సీసాలో స్టోర్ చేసి రోజూ రెండుసార్లు ముఖానికి, కాళ్లు, చేతులకు రాస్తే ఒక్క వారంలోనే పగుళ్లు పూర్తిగా మాయమవుతాయి.
  •  కొబ్బరి నూనె పగిలిన చర్మానికి చక్కని ఔషధంలా పనిచేస్తుంది. 2 టీస్పూన్ల కొబ్బరి నూనె, 1 టీస్పూన్ చక్కెర కలిపి రోజూ రాత్రి చేతులు, పాదాలకు జెంటిల్‌గా రుద్ది 5 నిమిషాలు మసాజ్ చేసి కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి మెత్తదనం వస్తుంది.
  •  2 టీస్పూన్ల తేనె, 5 చుక్కల నిమ్మరసం కలిపి పగుల్ల మీద రాసి 15 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీళ్లతో కడగాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  •  గ్లిజరిన్, రోజ్ వాటర్​ను సమంగా కలిపి చేతులు, ముఖం, పెదాలకు రోజూ రెండు సార్లు రాయాలి. ఇది అద్భుతమైన మాయిశ్చరైజర్​లా పనిచేసి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
  •  2 టీస్పూన్ల ఓట్‌మీల్ పౌడర్, పాలు కలిపి పేస్ట్ చేసి పగుళ్ల మీద రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల దురద, పొడిబారడం తగ్గుతాయి.
  •  రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ రాసిన తర్వాత కాటన్ సాక్స్, గ్లౌజెస్ వేసుకుంటే చర్మం మెత్తబడుతుంది. చలికాలంలోనూ నీళ్లు ఎక్కువగా తాగాలి. గోరువెచ్చని నీళ్లతోనే స్నానం చేయాలి. ఎక్కువ వేడినీళ్లతో స్నానం చేస్తే చర్మం మరింత పొడిబారుతుంది. మరెందుకు ఆలస్యం.. ఇప్పుడే ట్రై చేసి చూడండి!