Lemon Water Side Effects: నిమ్మరసం మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలుసు. ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. దీనితో పాటు నిమ్మకాయ జీర్ణక్రియ సులభతరం చేస్తుంది. దీంతో కడుపుకు సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి. అయినప్పటికీ, ఏదైనా అధికంగా ఉపయోగించడం హానికరమని నిపుణులు పేర్కొంటున్నారు. నిమ్మరసం ఎక్కువగా తాగడం మన శరీరానికి అస్సలు మంచిది కాదని పేర్కొంటున్నారు. నిమ్మకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..
నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు..
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఈ పోషకాల స్థాయి పెరిగితే.. అది చాలా ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది. కావున దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. నిమ్మకాయ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
కడుపునొప్పి : విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్ల స్రావం పెరుగుతుంది. ఇది ఎసిడిటీ ప్రమాదాన్ని పెంచుతుంది. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలు వస్తాయి. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్‌తో బాధపడేవారు తక్కువ నిమ్మరసం తాగాలి.
నోటిలో బొబ్బలు: నిమ్మకాయ నోటి దుర్వాసన, దంతాలను శుభ్రపరుస్తుంది, అయితే మీరు నిమ్మకాయ నీటిని ఎక్కువగా తాగితే అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ నోటి కణజాలాలలో వాపును కలిగిస్తుంది. దీని కారణంగా పొక్కులు, బొబ్బలతోపాటు నోటిలో అసౌకర్యంగా ఉంటుంది.
బలహీనమైన దంతాలు : నిమ్మరసం తాగినప్పుడల్లా జాగ్రత్తగా ఉండాలి. దీనిలోని ఆమ్లాలు దంత సమస్యలను పెంచుతాయి. అంతేకాకుండా దంతాలు బలహీనంగా మారతాయి.
ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..