వంశపారంపర్యంగా వచ్చే సికిల్ సెల్ అనీమియా.. ఈ వ్యాధి బారిన పడితే డేంజర్.. లక్షణాలు ఎలా గుర్తించాలంటే..

|

Jun 19, 2024 | 7:09 PM

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 44 లక్షల మంది సికిల్ సెల్ అనీమియా వ్యాధితో బాధపడుతున్నారు. భారతదేశంలో కూడా ఈ వ్యాధి బారిన పడిన వారున్నారు. ఇది ప్రమాదకరమైన రక్త సంబంధిత రుగ్మత. వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స చేయకపోతే.. రోగి మరణించే ప్రమాదం ఉంది. సికిల్ సెల్ అనీమియా వ్యాధి కారణంగా రోగి చాలా సమస్యలను ఎదుర్కొంటాడు. ఈ సమస్య పుట్టుకతో కూడా రావచ్చు. ఈ వ్యాధి గురించి ప్రముఖ వైద్య్తులు కొన్ని సలహాలు సూచనలు చేశారు. అవి ఏమిటో తెలుసుకుందాం..

వంశపారంపర్యంగా వచ్చే సికిల్ సెల్ అనీమియా.. ఈ వ్యాధి బారిన పడితే డేంజర్.. లక్షణాలు ఎలా గుర్తించాలంటే..
Sickle Cell Anemia
Follow us on

రక్తానికి సంబంధించిన అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులలో ఒకటి ‘సికిల్ సెల్ అనీమియా’. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం కొన్ని కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 44 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. భారతదేశంలో కూడా ఈ వ్యాధి బారిన పడిన వారున్నారు. ఇది ప్రమాదకరమైన రక్త సంబంధిత రుగ్మత. వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స చేయకపోతే.. రోగి మరణించే ప్రమాదం ఉంది. సికిల్ సెల్ అనీమియా వ్యాధి కారణంగా రోగి చాలా సమస్యలను ఎదుర్కొంటాడు. ఈ సమస్య పుట్టుకతో కూడా రావచ్చు. ఈ వ్యాధి గురించి ప్రముఖ వైద్య్తులు కొన్ని సలహాలు సూచనలు చేశారు. అవి ఏమిటో తెలుసుకుందాం..

సికిల్ సెల్ అనీమియా వ్యాధి ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేస్తుందని.. దీని కారణంగా శరీరంలో ఎర్ర కణాల లోపం ఏర్పడుతుందని మ్యాక్స్ హాస్పిటల్‌లోని ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్ డాక్టర్ రోహిత్ కపూర్ వ్యాధి లక్షణాలను గురించి వివరిస్తున్నారు. సికిల్ సెల్ అనీమియా వ్యాధి వల్ల ఎర్రరక్తకణాల ఆకారం కొడవలిలాగా మారుతుంది. దీంతో శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరగదని తెలిపారు. కొడవలి కణ రక్తహీనత అనేది ఒక వంశానుగత రక్త రుగ్మతని తెలిపారు.

హిమోగ్లోబిన్ ప్రోటీన్ అసాధారణత శరీరంలో ఉన్న ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నానికి ప్రధాన కారణం. ఇది కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల జరగవచ్చు. అందుకే సికిల్ సెల్ అనేది జన్యుపరమైన వ్యాధి.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మంది పిల్లలు సికిల్ సెల్ అనీమియా కారణంగా జన్మిస్తున్నారు. తల్లిదండ్రులిద్దరికీ ఈ వ్యాధి ఉన్నట్లు అయితే వీరికి జన్మించే శిశివుకి కూడా ఈ వ్యాధి బారిన పడతారు.

ఇవి కూడా చదవండి

ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మందగిస్తుంది

స్కిన్ సెల్ అనీమియా కారణంగా ఎర్ర రక్త కణాల నిర్మాణం వేగం తగ్గుతుందని డాక్టర్ రోహిత్ కపూర్ వివరించారు. కణాల జీవితకాలం కూడా తగ్గిపోతుంది. ఒక సాధారణ వ్యక్తిలో ఎర్ర రక్త కణాలు 120 రోజుల పాటు జీవించి మళ్ళీ ఆరోగ్యకరమైన కొత్త కణాలు ఏర్పడిన తర్వాత నాశనం అవుతాయి. అయితే సికిల్ సెల్ వ్యాధి ఉన్న రోగిలో ఈ ఎర్ర రక్త కణాల జీవిత కాలం 20 నుంచి 30 రోజులు మాత్రమే.. ఇవి కేవలం ముప్పై రోజుల్లోనే నాశనం అవుతాయి. సికిల్ సెల్‌లో ఎర్ర రక్త కణాలు చాలా నెమ్మదిగా ఉత్పత్తి అవుతాయి కనుక వ్యక్తి శరీరంలో రక్తం లేకపోవడంతో రక్త హీనత ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో.. రోగికి ఎముక మజ్జ మార్పిడి ద్వారా చికిత్స చేస్తారు. అయితే ఎక్కువ సందర్భాలలో దాత అందుబాటులో ఉండడం లేదు.

ఈ వ్యాధి లక్షణాలు ఏమిటంటే?

  1. తరచుగా జ్వరం
  2. శరీరంలో వాపు
  3. శరీరం పసుపు రంగులోకి మారినా
  4. శరీరంలో తగిన అభివృద్ధిలోపించినా

ఈ వ్యాధిని ఎలా గుర్తించాలంటే?

ఈ వ్యాధి నిర్ధారణ కోసం చేసే రక్త పరీక్ష ఖరీదు చాలా తక్కువలోనే అంటే రూ.10 లోపే ఉంటుంది. ఈ వ్యాధిని హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరేసిస్ రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఎవరిలోనైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఈ పరీక్ష చేయించుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర (PHC) స్థాయిలోనే ఈ వ్యాధి నిర్ధారణ ప్రాథమిక పరీక్షను చేస్తారు.

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..