Sleeping Effects: నిద్ర తక్కువైన వారు… ఇతరులను తప్పుగా అంచనా వేస్తున్నారు. అంతేకాదు వీరు సామాజిక ప్రతికూలతలను కూడా ఎదుర్కోవలసి వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. స్వీడన్‌కు చెందిన ఉప్సల విశ్వవిద్యాలయం పరిశోధకుల స్టడీలో 45 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఒక రోజంతా నిద్రపోకుండా, ఇతరుల ముఖాలను చూసి వారు ఎలాంటి వారు అన్నది గుర్తించారు. మరో రోజు 8 గంటలు కునుకు తీసిన తర్వాత ఇతరుల ముఖాలను గమనించి, వారిని అంచనా వేశారు. ఇందుకు ‘ఐ-ట్రాకింగ్’ సెన్సర్ సాంకేతికత ఉపయోగించారు.
‘‘సరిగా నిద్రపోనివారు… కోపంతో ఉన్న ముఖాలను చూసి వారిని తక్కువ విశ్వసనీయత ఉన్న వ్యక్తులుగానూ, ఆరోగ్యవంతులుగానూ గుర్తించారు. ఎలాంటి భావాలూ కనిపించని తటస్థ ముఖాల వారిని తక్కువ ఆకర్షణీయమైన వ్యక్తులుగా పరిగణించారు. ఇలాంటి తప్పుడు భావాలు సామాజిక బంధాలపైనా ప్రభావం చూపుతాయి’’ అని న్యూరోసైన్స్ నిపుణుడు విశ్లేషించారు.