Oregano Herb Benefits: మొక్కలు ప్రకృతి ఇచ్చిన బహుమతి. ఇవి కంటికి ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఆరోగ్య సమస్యలకు సహాయపడతాయి. ఔషధాలను ఇచ్చే మొక్కలు చికిత్సకు మాత్రమే కాదు.. కొన్ని రకాల సౌందర్య సాధనాలుగా కూడా ఉపయోగిస్తారు. అటువంటి దానిలో ఒకటి ఒరెగానో. అడవి మర్జోరమ్ అని కూడా పిలుస్తారు. ఈ హెర్బల్ మొక్క అన్ని రకాల వాతావరణాల్లో పెరుగుతుంది. దీనిని పెంచుకోవడం చాలా ఈజీ.. చిన్న చిన్న కుండీలలో కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్క ఆకులు అండాకారంలో ఆలివ్ గ్రీన్ రంగులో ఉంటాయి. ఉదా రంగు పూలు పూస్తాయి. ఇటలీ, మెక్సికో, రష్యాలో అడవిల్లో పెరిగే ఈ ఒరెగానోను స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, అమెరికాలో సాగు చేస్తారు. రుచి కారంగా, వెచ్చగా మరియు కొద్దిగా చేదుగా ఉంటుంది. ఈ రోజు ఒరెగానో ఇచ్చే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
సువాసనగల ఒరేగానో మొక్క 1 వ శతాబ్దం AD నాటిది. గ్రీకు శాస్త్రవేత్త డయోస్కోరిడోస్.. ఒరేగానోలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రస్తావించారు.
ఒరేగానోలో లక్షణాలు: ఒరెగానోలో బాక్టీరిసైడ్ లో కార్వాక్రోల్, థైమోల్, టెర్పెనెస్, ఆస్కార్బిక్ ఆమ్లం, టానిన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. అంతేకాదు ఒరేగానోలో క్రిమిసంహారక లక్షణాలు ఉన్నాయి.
ఆరోగ్యప్రయోజనాలు: ఒరేగానో దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ వాపు, క్షయవ్యాధి నివారణకు సహాయపడుతుంది. రుమాటిజం, తిమ్మిరి, మైగ్రేన్లు, ఉబ్బరం, ఆకలి లేకపోవడం, విరేచనాలు, కామెర్లు , వంటి ఇతర కాలేయ వ్యాధులకు ఒరేగానోను ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో పాలీ ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. వీటి ఆకులను ఎండబెట్టి ప్యాక్ చేసిన హెర్బల్ గా ఉపయోగిస్తారు. అంతేకాదు వీటిని రెగ్యులర్ ఆహారంలో తీసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..
లైంగిక కోరికలను పెంచుతుంది. గాయాలను వేగంగా నయం చేస్తుంది. పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఈ మొక్క ఆకుల్లో మధుమేహాన్ని నియంత్రించే ఎంజైమ్స్ ఉన్నాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఈ ఆకులను ఏవిధంగా తీసుకున్నా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుంది.
ఒరేగానోతో స్నానం ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కొంతమంది ఒరేగానోను సబ్బులా ఉపయోగిస్తారు. చర్మంపై ఉండే దద్దుర్లను తగ్గించడంలో సహాయపడుతుంది. పురాతన కాలంలో, వైద్యులు తలనొప్పికి ఒరేగానోను సిఫారసు చేశారు. అలాగే ఈ మొక్క కాలేయంపై పనిచేస్తుంది. ఈ ఆకులను టీలో వేసుకుని తాగితే ఒత్తిడిని తగ్గిస్తుంది మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. ఈ ఆకులను సలాడ్ లో కలుపుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Also Read: సిక్కోలు స్ఫూర్తి చూపించాలని.. వలసలు ఆగే విధంగా ఉపాధి అవకాశాలు పెరగాలని కోరిన పవన్ కళ్యాణ్