Sannajajulu: ఈ చెట్టు పువ్వులు, ఆకులు, వేర్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు .. సోరియాసిస్ వంటి చర్మవ్యాధిని నివారించే గుణం ఈ ఆకుల సొంతం

|

Sep 02, 2021 | 10:11 AM

Sannajaji Flowers: మల్లెలు తర్వాత మగువ మనసు దోచే పువ్వులు సన్నజాజులు. ఈ పేరు వినగానే మంచి పరిమళం మదిని తడుతుంది. ఈ మొక్కను వైల్డ్ జాస్మిన్, వింటర్ జాస్మిన్ వంటి రకరకాల..

Sannajajulu: ఈ చెట్టు పువ్వులు, ఆకులు, వేర్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు .. సోరియాసిస్ వంటి చర్మవ్యాధిని నివారించే గుణం ఈ ఆకుల సొంతం
Sannajaji Flowers
Follow us on

Sannajaji Flowers: మల్లెలు తర్వాత మగువ మనసు దోచే పువ్వులు సన్నజాజులు. ఈ పేరు వినగానే మంచి పరిమళం మదిని తడుతుంది. ఈ మొక్కను వైల్డ్ జాస్మిన్, వింటర్ జాస్మిన్ వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. సాయంత్రం అవగానే చెట్టుకి విచ్చుకున్న పువ్వులను కోయడానికి అమ్మాయిలు పోటీ పడతారు. అయితే ఈ సన్నజాజి మొక్క ప్రతి తెలుగు వారి ఇంట్లో కొలువుదీరుతుంది. ఇది మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందట. అంతేకాదు సన్నజాజుల పరిమళాన్ని పీల్చడం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ చెట్టు ను వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది. శివుడి అనుగ్రహాన్ని ఇస్తాయి. సఖల దేవత ఆరాధన సన్నజాజులతో చేయవచ్చు. అయితే సన్నజాజి పూలను పలు ఆయుర్వేద ఔషధాల తయారీలో పూర్వం నుండి ఉపయోగిస్తూన్నారు. ఇక ఈ పూలను టీ గా చేసుకుని తాగుతారు. మరి ఈ చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

సన్నజాజి ‘టీ’ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు : 

*ఈ పువ్వులు టీ యాంటిడిప్రెసెంట్ మరియు కామోద్దీపన లక్షణాలను కలిగి ఉంది.
*ఈ పూల టీ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
*రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. డయాబెటిస్‌ను నివారిస్తుంది.
*క్యాన్సర్ కణాల పెరుగుదలను  నిరోధిస్తుంది.
* రొమ్ము , ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
* జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.  జీర్ణకోశ క్యాన్సర్‌ను నివారిస్తుంది.
* స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతుంది.  నపుంసకత్వాన్ని నయం చేస్తుంది.
* టీ బరువు తగ్గాలనుకునేవారికి దివ్య ఔషధం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
* కండరాల నొప్పులు తగ్గిస్తుంది
* వడదెబ్బ, దద్దుర్లు, వేడి, అలసటలను నివారిస్తుంది
*బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

సన్నజాజి ఆకులు, వేర్లు వలన ఉపయోగాలు: 

*ఈ ఆకుల టీ లైంగిక సమస్యల నుంచి బయపడేస్తుంది.
*నోటి పూత, నోట్లో పుండ్లు తో బాధపడేవారు 10 సన్నజాజి ఆకులను కొన్ని తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి కషాయంలా తయారు చేసుకుని చల్లారిన తర్వాత ఈ కషాయాన్ని నోటిలో పోసుకొని పుక్కిలించి ఊసేయాలి. ఇలా చేస్తే నోట్లో పుండ్లు, నోటి పూత తగ్గుతాయి.
*సోరియాసిస్, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులకు ఈ ఆకులను మెత్తగా నూరి లేపనం గా రాస్తే చర్మ వ్యాధులు నివారింపబడతాయి.

*సన్నజాజి చెట్టు వేర్లు, పూలను పేస్ట్ గా నూరి ఆ పేస్ట్ ను జుట్టు కుదుళ్లకు రాయాలి.  అరగంట అనంతరం తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు ఊడటం, చుండ్రు సమస్య నివారింపబడతాయి.  జుట్టు ఒత్తుగా పెరుగడానికి సహాయపడుతుంది.

సన్నజాజి పూలను అందం ,ఆరోగ్య సంరక్షణ పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. అంతేకాదు సాంప్రదాయ వైద్యంలో శరీరానికు రక్షణగా ఉపయోగిస్తున్నారు. సన్నజాజి పూల వాసన ప్రశాంతత , విశ్రాంతి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందుకనే తలనొప్పి, ఆందోళన, చిరాకు ,  డిప్రెషన్ చికిత్సకు ఉపయోగిస్తారు.

Also Read:  సినీ రంగంలో ‘పవన్’ మొదటి ఎంట్రీ.. ‘లెజెండరీ డైరెక్టర్’ సినిమాతో అన్న విషయం మీకు తెలుసా..!