Salmonellosis: అమెరికా, యూరప్‌లో విస్తరిస్తున్న సాల్మోనెలోసిస్.. జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు..!

|

Apr 28, 2022 | 2:02 PM

Salmonellosis: అమెరికా, యూరప్‌లో సాల్మొనెలోసిస్ విస్తరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. అమెరికా, ఐరోపాలో 150 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి .

Salmonellosis: అమెరికా, యూరప్‌లో విస్తరిస్తున్న సాల్మోనెలోసిస్.. జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు..!
Salmonellosis
Follow us on

Salmonellosis: అమెరికా, యూరప్‌లో సాల్మొనెలోసిస్ విస్తరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. అమెరికా, ఐరోపాలో 150 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి . దాదాపు ఒక నెల క్రితం UKలో సాల్మొనెల్లా టైఫిమూరియం కేసులను గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా పిల్లలు, వృద్ధులలో డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ ఆహార తయారీదారు తన ప్లాంట్‌లో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు తెలియడంతో ఉత్పత్తులని నిలిపివేసింది. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యాధి వచ్చాక బాధపడటం కంటే రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కాబట్టి ఈ వ్యాధి ఏంటి.. దీని లక్షణాలు ఎలా ఉంటాయి. చికిత్స ఎలా తీసుకోవాలో తదితర విషయాలు తెలుసుకుందాం.

ఈ వ్యాధి ఏమిటి?

సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ అంటే సాల్మొనెలోసిస్ అనే బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఇది మానవుల ప్రేగులను ప్రభావితం చేస్తుంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా సోకిన వ్యక్తి ముట్టుకున్న నీటిని తాగడం, లేదా ఆహారం తినడం ద్వారా లేదా కలుషితమైన ఆహారం తీసుకోవడం ద్వారా మానవులు ఈ వ్యాధికి గురవుతారు. సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ ఎనిమిది గంటల నుంచి మూడు రోజులలోపు ఉంటుంది. దీనివల్ల జ్వరం, అతిసారం, కడుపు నొప్పి ఉంటుంది. కొంతమందిలో లక్షణాలు అస్సలు కనిపించవు.

ఇతర కారణాలు

మనుషులే కాకుండా జంతువులు, పక్షుల ప్రేగులలో కూడా సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఈ పరిస్థితిలో తక్కువగా ఉడికించిన చికెన్, మటన్, గుడ్లు ఉత్పత్తులు తినడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. సాల్మోనెల్లా లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. తలనొప్పి, జ్వరం. వికారం, వాంతులు, చలి, కటి నొప్పి, అతిసారం, మలంలో రక్తం మొదలైనవి ఉంటాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Health Tips: ఎండాకాలం ఈ కూరగాయల జ్యూస్‌లు తాగితే బోలెడు ప్రయోజనాలు..!