Skin Care: చర్మ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో చెక్‌ పెట్టేయండి..

చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సంబంధిత వ్యాధులు ఎక్కువుగా వస్తుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది.  చలికాలం చర్మాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. శీతాకాలంలో చర్మ సమస్యలను నివారించాలంటే గులాబీ రేకులను వాడితే సరిపోతుంది. గులాబీ రేకులు చర్మాన్ని..

Skin Care: చర్మ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో చెక్‌ పెట్టేయండి..
Rose

Updated on: Dec 21, 2022 | 8:20 PM

చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సంబంధిత వ్యాధులు ఎక్కువుగా వస్తుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది.  చలికాలం చర్మాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. శీతాకాలంలో చర్మ సమస్యలను నివారించాలంటే గులాబీ రేకులను వాడితే సరిపోతుంది. గులాబీ రేకులు చర్మాన్ని మెరిసేలా చేసి ఆరోగ్యంగా ఉంచుంతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉండడంతో చర్మం తాజాగా ఉంటుంది.  రోజ్ వాటర్ లేదా పాలలో గులాబీ రేకులను మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయాలి.  దీనికోసం 1 టీస్పూన్ పేస్ట్‌లో ఒక టీస్పూన్ తేనె కలపాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.  జిడ్డుగల చర్మం ఉంటే నారింజ తొక్కలను పొడిగా చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టీస్పూన్ల ఆరెంజ్ పౌడర్, 2 టీస్పూన్ల గులాబీ రేకుల పేస్ట్, 1 టీస్పూన్ తేనె కలపాలి. దీన్ని ముఖం, మెడపై పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తాజా చర్మం కోసం 2 టీస్పూన్ల గులాబీ రేకుల పేస్ట్, 1 టీస్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ చందనం పొడి, 1 చిటికెడు పసుపు కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి 3 రోజులు ఇలా చేస్తే చర్మం తాజాగా ఉంటుంది. మెటిమల నుంచి రక్షణ కోసం చాలామంది అనేక రకాల క్రీములు ట్రై చేస్తుంటారు. అలాగే పురుషులు, మహిళలు మొటిమల వల్ల ఇబ్బంది పడుతున్నారు. కానీ గులాబీలతో చేసిన ఫేస్ ప్యాక్ ఈ సమస్యను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు పెరగకుండా నిరోధిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..