Skin Problems: చలి కాలంలో చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

|

Dec 28, 2021 | 9:26 PM

చలికాలం మన చర్మాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. చలితో చర్మం పొడి బారుతుంది...

Skin Problems: చలి కాలంలో చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..
Rose
Follow us on

చలికాలం మన చర్మాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. చలితో చర్మం పొడి బారుతుంది. దానిని మీరు నివారించాలనుకుంటే గులాబీ రేకులను వాడాలి. గులాబీ రేకులు చర్మాన్ని మెరిసేలా చేసి ఆరోగ్యంగా ఉంచుంతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉండడంతో చర్మం తాజాగా ఉంటుంది.

పొడి చర్మం ఉంటే
రోజ్ వాటర్ లేదా పాలలో గులాబీ రేకులను మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయండి. ఇప్పుడు 1 టీస్పూన్ పేస్ట్‌లో ఒక టీస్పూన్ తేనె కలపండి. ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

జిడ్డుగల చర్మం ఉంటే
నారింజ తొక్కలను పొడిగా చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టీస్పూన్ల ఆరెంజ్ పౌడర్, 2 టీస్పూన్ల గులాబీ రేకుల పేస్ట్, 1 టీస్పూన్ తేనె కలపాలి. దీన్ని ముఖం, మెడపై పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తాజా చర్మం కోసం
2 టీస్పూన్ల గులాబీ రేకుల పేస్ట్, 1 టీస్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ చందనం పొడి,1 చిటికెడు పసుపు కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి 3 రోజులు ఇలా చేస్తే చర్మం తాజాగా ఉంటుంది.

మొటిమల నుంచి రక్షణ
పురుషులు, మహిళలు మొటిమల వల్ల ఇబ్బంది పడుతున్నారు. కానీ గులాబీలతో చేసిన ఫేస్ ప్యాక్ ఈ సమస్యను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు పెరగకుండా నిరోధిస్తాయి.

Read Also.. Sperm Cells: మీలో అవి తక్కువగా ఉండి బలహీనంగా ఉన్నాయా..? ఈ ఆహార పదార్థాలను తీసుకోండి