Diabetes Symptoms: ప్రస్తుతమున్న కాలంలో రోగాల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాల్లో ఒత్తిడిలు, తినే ఆహారం, సరైన వ్యాయమం లేకపోవడం తదితర కారణాలతో వివిధ రకాల వ్యాధులు దరి చేరుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. షుగర్ వాధి ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఇక మనదేశంలో షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. అయితే చాలా మంది మొదట్లో తమకు డయాబెటిస్ ఉందన్న విషయం గుర్తించలేకపోతున్నారు. దాంతో వ్యాధి ముదిరి ముప్పు పెరిగిపోతోంది. అందుకే డయాబెటిస్ వచ్చే ముందు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
అయితే డయాబెటిస్ వచ్చే ముందు లక్షణాలను గమనిస్తే ముందుగానే అప్రమత్తం కావచ్చు. ముందుగా కనిపించే లక్షణాలను ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. ఈ దశలో కొందరికి జట్టు రాలడం మొదలవుతుంది. మరికొందరికి రోజంతా అలసటగా ఉండటం, ఏం పని చేయకపోయినా కూడా అలసటగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కొందరికి చర్మంపై మచ్చలు వస్తుంటాయి. కొందరిలో తరచూ మూత్ర విసర్జన అవుతూ ఉంటుంది. కొంతమందిలో వీటికి అదనంగా తలనొప్పి, చేతులు కాళ్లు తిమ్మిర్లు పట్టడం లాంటి లక్షణాలు కూడా డయాబెటిస్‌కు సంకేతాలుగా చెప్పవచ్చంటున్నారు వైద్య నిపుణులు. పై లక్షణాలలో ఏది కనిపించినా వెంటనే షుగర్ పరీక్షలు చేయించుకోవడం మంచిదంటున్నారు. అయితే ఆరోగ్య నిపుణులు, అధ్యాయనాల ప్రకారం ఈ వివరాలు అందిస్తున్నాము. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న ముందుగా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.