Red Meat: ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్య బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. అధిక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల అనారోగ్య బారిన పడే వారు ఎక్కువ అవుతున్నారు. తినే తిండిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. ఇక ఆరోగ్యానికి శాకాహారం మంచిదా? మాంసాహారం మంచిదా? అనే అనుమానాలు చాలా మందిలో తలెత్తుతుంటాయి. అయితే కొన్నిరకాల మాంసాల (రెడ్ మీట్)తో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగతాయని ఇప్పటికే కొన్ని పరిశోధనలు వెల్లడించారు. దీనిపై శాస్త్రవేత్తలు కూడా అధ్యయనాలు చేశారు. గొడ్డు మాంసం, గొర్రె, పది, ప్రాసెస్ చేసిన మాంసాలు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. రెడ్‌మీట్ గుండెకు అంత మంచిది కాదంటున్నారు. బీఫ్, గొర్రె, పంది మాంసం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే కొలెస్ట్రాల్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల గోడల ప్రభావం చూపడం వల్ల గుండె జబ్బు పెరిగే అవకాశం ఉందంటున్నారు. జంతువులతో పాటు కొన్ని రకాల చేపలు, పాల ఉత్పత్తుల్లో సీఎంఏహెచ్ అనే జన్యువు ఉంటుంది. ఇది న్యూ5జీసీ అనే చక్కెర కణాలను ఉత్పత్తి చేస్తూంటుంది. మనుషుల్లోనూ సీఎంఏహెచ్ జన్యువు ఉన్నప్పటికీ దాంట్లో కొన్ని మార్పులు ఉంటాయి.
అయితే న్యూ5జీసీ చక్కెర కణాలు ఉత్పత్తి కావు. రెడ్ మీట్ వంటివి తిన్నప్పుడు వాటిలోని న్యూ5జీసీ చక్కెరలు శరీరంలోకి చేరతాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థ వీటిని పరాయి కణాలుగా గుర్తిస్తుంది. వదిలించుకునే తీరులో స్పందిస్తుంది. ఇది కాస్తా వాపు, మంటలకు, కీళ్లనొప్పులకు, చివరకు క్యాన్సర్‌కూ కారణంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూ5జీసీ చక్కెరలు ఉత్పత్తి చేసే జంతువులు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు చాలా జంతు జన్యుక్రమాలను పరిశీలించారు. పరిణామ క్రమంలో కొన్ని వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు మానవుల్లోని సీఎంఏహెచ్ జన్యువు పనిచేయకుండా పోయిందని కొన్ని జంతువులు, చేపల్లో ఈ జన్యువు అలాగే ఉండటం, వాటి మాంసం మనం తీసుకోవడం వల్ల సమస్య ఏర్పడుతున్నట్లు గుర్తించారు.