Miracle Plant Ranapal: చిన్నతనంలో ఆకు వేస్తే మొక్కలు వస్తాయని.. ఇష్టంగా పెంచుకునే మొక్క’రణపాల’ . దీన్ని ఆఫీసుల వద్ద, ఇంటి పరిసరాల్లో అలంకరణ మొక్కగా పెంచుతారు. అందంకోసం పెచుకునే ఈ మొక్కలో ఎన్నో వైదులను నయం చేసే గుణం ఉందట.. ఆయుర్వేదం లో విశిష్ట స్థానం దక్కించుకున్న ఈ రణపాల మొక్క సుమారుగా 150 కి పైగా రోగాలను నయం చేస్తుందట. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలను రణపాల ఆకు ద్వారా నయం చేసుకోవచ్చట. ఈ మొక్క ఆకులు కాస్త మందంగా తింటే వగరు, పులుపుగా అనిపిస్తాయి. ఈ మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీ సమస్యల నివారణకు:
రణపాయ ఆకులు కిడ్నీల సమస్యలు, కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకులను రోజూ ఉదయం, సాయంత్రం రెండు చొప్పున తినాలి. లేదా ఉదయం ఆకుల కషాయాన్ని 30 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. దీంతో కిడ్నీలు, బ్లాడర్‌లో ఉండే స్టోన్లు కరిగిపోతాయి. మూత్రపిండాల పనితీరు మెరుగు పడుతుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులకు :
రణపాల ఆకులను తింటే రక్తంలోని క్రియాటిన్ లెవల్స్ తగ్గుతాయి. రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకులను 2 చొప్పున తింటుంటే డయాబెటిస్ తగ్గుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
జీర్ణాశయ సమస్యలకు :
రణపాల ఆకులను తినడం ద్వారా జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్దకం సమస్యలను నివారిస్తుంది
ఇన్ఫెక్షన్స్ :
జలుబు, దగ్గు, విరేచనాలతో బాధపడేవారికి రణపాల ఆకు మంచి ఔషధం. ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ లక్షణాలతో మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వారికీ మంచి మేలు చేస్తుంది.
రక్తపోటు:
రణపాల మొక్క రసాన్ని ఐదు నుంచి పది చుక్కల వరకు తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
జుట్టు సమస్యలకు:
ఈ ఆకులను తింటే జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల వెంట్రుకలు రావడం తగ్గుతాయి
కొవ్వు గడ్డలు, వేడి కురుపులు:
రణపాల ఆకులను పేస్ట్‌లా చేసి కట్టు కడుతుంటే కొవ్వు గడ్డలు, వేడి కురుపులు తగ్గుతాయి. శరీరంలో వాపులు నయమవుతాయి
కామెర్లకు .
కామెర్లు ఉన్నవారు రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. దీంతో వ్యాధి నయం అవుతుంది.
చెవిపోటు:
రణపాల ఆకుల రసం ఒక్క చుక్కను చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
యోని రుగ్మతలు:
స్త్రీలలో ఎక్కువగా యోని సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. ఇలాంటి వారికి రెండు గ్రాముల తేనె ను 40 నుంచి 60 మిల్లీ లీటర్ల కషాయం లో కలిపి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.
తలనొప్పి
రణపాల ఆకులను పేస్ట్‌లా చేసి నుదుటిపై పట్టీలా వేస్తే తలనొప్పి తగ్గుతుంది.
అంతేకాదు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకా అనేక రోగాలకు ఈ రణపాల మొక్క నివారణకారిగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే.. ఎవరినైనా వ్యాధి ఏమిటో తెలియకుండా ఇబ్బంది పడుతుంటే.. ఈ ఆకు తింటే కొంత ఉపశమనం కలుగుతుంది అని కొన్ని పరిశోధకుల చెబుతున్నారు.
Also Read: Patal Bhuvaneshwar: ఎన్నో రహస్యాలకు నిలయం పాతాళ భువనేశ్వర్ గుహాలయం.. ఇక్కడనుంచి పాండవులు కైలాసానికి వెళ్లారట..
Horse Grams: ఒకప్పుడు పేదవాడి గుగ్గుళ్ళు ఉలవలు.. నేడు ఖరీదైన ఆహారం.. స్టేటస్ సింబల్.. ఉలవలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు..