Health Benefits: శృంగారంలో వీక్‌గా ఉన్నారా..? అయితే ఈ గింజలు తింటే రెచ్చిపోతారంట

మనజీవితంలో ఎన్నో సమస్యలతో, ఒత్తిళ్లతో నిండిపోయి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉన్న పరిస్థితుల్లో కాలంతో పటు పరుగులు పెడుతున్నారు ప్రజలు.

Health Benefits: శృంగారంలో వీక్‌గా ఉన్నారా..? అయితే ఈ గింజలు తింటే రెచ్చిపోతారంట
Helth Benefits

Updated on: Sep 08, 2022 | 8:24 AM

మనజీవితంలో ఎన్నో సమస్యలతో, ఒత్తిళ్లతో నిండిపోయి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉన్న పరిస్థితుల్లో కాలంతో పటు పరుగులు పెడుతున్నారు ప్రజలు. దాంతో వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతే ఎన్నో ఆరోగ్యసమస్యలను కూడా కొనితెచ్చుకుంటున్నారు. వాటిలో శృంగార సమస్య ఒకటి. చాలా మంది మగాళ్లు శృంగార సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఒత్తిడికి లోనుకావడం వల్ల చాలా మంది మగాళ్లు శృంగార జీవితాన్ని సంతోషంగా గడపలేకపోతున్నారు. నిత్యం చాలా మంది ఈ సమస్యలకు పరిష్కారం కోసం ఏవేవో టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అయితే ఇంగ్లిష్ మందులకంటే ప్రకృతి సిద్దమైన చికిత్సతో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు పరిశోధకులు .

మగాళ్లలో శృంగార సమస్యలకు చెక్ పెట్టేందుకు గుమ్మడి గింజలు ఔషధంగా పనిచేస్తాయట. శృంగారంలో వీక్ అని బాధపడే పురుషులు ఈ గుమ్మడి గింజలు గానీ తింటే వారిలో వీర్యం బాగా ఉత్పత్తి అవుతాయట. శుక్ర కణాల్లో కదిలికలు ఏర్పడి సంతానలేమి సమస్యలు కూడా తగ్గిపోతాయని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ప్రత్యేకించి పురుషుల్లో టెస్టోస్టిరాన్ విలువలను పెంచుతాయట ఈ గింజలు. వీటివల్ల శృంగార సామర్థ్యం బాగా పెరిగిపోతుంది. గుమ్మడి గింజలు తినేవారిలో పురుషుల్లో ప్రోస్టేట్ సమస్యలు ఎప్పటికి రాకుండా అడ్డుకునే గుణం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అంతే కాదు గుమ్మడి గింజల వల్ల మరిన్ని ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి.. గ్యాస్టిక్, బ్రెస్ట్, లంగ్, కేన్సర్లు దగ్గరకు చేరవు, గుండెకు ఎంతో ఆరోగ్యం.. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తాయి,ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోదు, డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఇవి కూడా చదవండి

Pumpkin Seeds

ఈ వార్త కేవలం అవగాహనకోసమే.. ఏదైనా సలహాలు, సూచనల కోసం.. నిపుణులను సంప్రదించండి