
ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు శరీరం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుందో తెలుసా..? ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం చాలా కష్టాలను ఎదుర్కొంటుంది. వేడి వాతావరణం మీ చర్మానికి, ఆరోగ్యానికి కీడు చేస్తుంది. మీరు జాగ్రత్తగా లేకపోతే డీహైడ్రేషన్, వడదెబ్బ, దద్దుర్లు లాంటి సమస్యలు వస్తాయి.
ఎండలో ఎక్కువసేపు ఉంటే చర్మం వడదెబ్బకు గురవుతుంది. UV కిరణాలు చర్మాన్ని ఎర్రబడేలా చేసి పొట్టు ఊడిపోయేలా చేస్తాయి. దీర్ఘకాలం ఎండలో ఉంటే చర్మ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది.
వేడి వల్ల చెమట ఎక్కువగా పోయి నీరు కోల్పోతాం. దీంతో బలహీనత, మైకం వస్తాయి. పైగా చర్మం కూడా పొడిగా మారుతుంది.
చెమట వల్ల రంధ్రాలు మూసుకుపోతాయి. దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు రావచ్చు.
వేడి వల్ల శరీరం అలసిపోతుంది. తలనొప్పి, వికారం వస్తాయి. ఇది తీవ్రంగా ఉంటే వడదెబ్బ కూడా వస్తుంది.
వేడి వాతావరణం గుండెకు అధిక ఒత్తిడి పెంచుతుంది.
అధిక ఉష్ణోగ్రతలు మీ ఆరోగ్యానికి కీడును చేస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.