
మైక్రోప్లాస్టిక్‌లు మన ఆహారం నీటిలో ఉన్నాయని మీకు తెలుసా..? వీటిని పూర్తిగా నివారించడం కష్టమే.. కానీ కుళాయి నీరు త్రాగడం, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఆహారాన్ని తగ్గించడం, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల ఈ ఎక్స్‌పోజర్‌ను తగ్గించవచ్చు. ఈ చిన్న మార్పులు మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతాయి.
మైక్రోప్లాస్టిక్‌లు మనం తీసుకునే గాలి, నీరు, ఆహారంలోనే కాకుండా మన రక్తం, ఊపిరితిత్తులు, మెదడులో కూడా చేరుతాయని పరిశోధకులు కనుగొన్నారు. వీటిని పూర్తిగా నివారించడం అసాధ్యం అయినప్పటికీ.. తీసుకునే మైక్రోప్లాస్టిక్‌ల పరిమాణాన్ని తగ్గించడానికి కొన్ని దశలు ఉన్నాయి.
వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం.. బాటిల్ నీటిలో మైక్రోప్లాస్టిక్‌ల భారీ వనరులు ఉన్నాయని తేలింది. ఒక లీటరు బాటిల్ నీటిలో 240,000 చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయని తేలింది. ఇవి కనబడనంత చిన్నవి. కుళాయి నీటిలో కూడా మైక్రోప్లాస్టిక్‌లు ఉంటాయి. కానీ తక్కువ పరిమాణంలో ఉంటాయి.
కుళాయి నీరు బాటిల్ నీటితో పోలిస్తే ఎక్కువ సురక్షితంగా ఉంటుంది. మంచి నీటి ఫిల్టర్ 90 శాతం వరకు మైక్రోప్లాస్టిక్‌లను తొలగించగలదు. కానీ ప్లాస్టిక్ పైపులు లేదా కంటైనర్‌లను వేడి చేయడం ద్వారా విషపూరిత రసాయనాలు విడుదల అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని నిల్వ చేసి మైక్రోవేవ్‌లో వేడి చేస్తారు. ఇది ప్రమాదకరం. ప్లాస్టిక్ వేడి చేయడం వల్ల మిలియన్ల కొద్దీ మైక్రోప్లాస్టిక్ కణాలు ఆహారంలోకి చేరుతాయి. బదులుగా గాజు లేదా సిరామిక్‌లను ఉపయోగించడం ఉత్తమం.
నైలాన్ టీ బ్యాగులు వేడి నీటిలో నానబెట్టినప్పుడు పెద్దమొత్తంలో మైక్రోప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయి. దీని వల్ల ప్రతి కప్పులో చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయి. కనుక టీ బ్యాగులకి బదులుగా లూజ్-లీఫ్ టీ వాడటం ఉత్తమం.
మైక్రోప్లాస్టిక్‌లు ప్రతి చోటా ఉన్నప్పటికీ.. తాజా ఆహారం తీసుకోవడం, గాజు కంటైనర్లు వాడటం, ఫిల్టర్ చేసిన నీరు త్రాగడం వంటి మార్పులు ఎక్స్‌పోజర్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.