Pressure cooker vs open cooking: మనకు ప్రధాన ఆహారం అన్నం. రోజులో ఒక్క పూటైనా అన్నం తింటే కావాల్సినంత శక్తి లభిస్తుంది. ఒకప్పుడు బియ్యాన్ని పాత్రలో నీళ్లు వేసి ఉండికించి వార్చేవారు. అందులో ఉండే గంజిని వంచేసి అన్నాన్ని తయారు చేసేవారు. అయితే, ఇప్పుడు చాలామంది ప్రెజర్ కుక్కర్లలోనే రైస్ వండుతున్నారు. పైగా ప్రెజర్ కుక్కర్లో అన్నం వండటం చాలా ఈజీ. ఇలా చెయ్యడం వల్ల అన్నం అడుగంటకుండా, మాడకుండా ఉంటుంది. విజిల్స్ లెక్క పెట్టుకుని స్టవ్ కట్టేస్తే చాలు అన్నం రెడీ అయిపోతుంది. గంజి వంచాలి.. పొయ్యి దగ్గర కూర్చోవాలి అన్న బాధ ఉండదు. అయితే పాత్రలో అన్నం ఉడికిస్తే అన్నం పలుకుగా ఉండి, ముద్ద కాదని అంటారు. పైగా ఎన్నో పోషకాలు ఉండే గంజి లభిస్తుంది. ఆ గంజి తాగితే ఎన్నో పోషకాలు లభిస్తాయి. గతంలో ఈ గంజిని చాలామంది తాగేవారు. ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెటూర్లలో తప్పితే గంజి వాసన చూసేవారు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఈ క్రమంలో ప్రెజర్ కుక్కర్‌లో రైస్ వండితే బెస్టా లేక పాత్రలో ఉడికించి గంజి తీసేసే అన్నం (బాయిల్డ్ రైస్) మంచిదా అనే విషయంలో చాలామంది అనుమామనాలున్నాయి. ఈ విషయంపై క్లారిటీ తెలుసుకుందాం పదండి.
కాబట్టి.. ప్రెజర్ కుక్కర్ వండిన ఆహారం తింటే ఎలాంటి సమస్యలు ఉండవు. పైగా పోషకాలు కూడా ఎక్కువ లభిస్తాయి. కుక్కర్‌లో అన్నం శరీరానికి వేడి చేస్తుందనేది కేవలం రూమర్ మాత్రమే. ఒక వేళ మీరు పాత్రలో అన్నం వండుతున్నా నష్టమేమి లేదు. అయితే వార్చిన గంజిని తాగితే.. అందులోని పోషకాలు మన శరీరానికి బాగా ఉపయోగపడతాయి.
గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Also Read: Cloves: లవంగాలతో దిమ్మతిరిగే ప్రయోజనాలు .. కనీసం మీ ఊహకు కూడా అందవు