Weight Gain Diet: ఈ గింజలు తింటే ఈజీగా బరువు పెరుగుతారు..!

బరువు పెరగడం అంటే కేవలం ఎక్కువగా తినడమే కాదు.. శరీరానికి కావాల్సిన పోషకాలను సరిగా అందించడం కూడా ముఖ్యం. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. శరీరం ఆరోగ్యంగా మారుతుంది. అందుకే మీ ఆహారంలో ఈ 5 రకాల ప్రోటీన్ ఎక్కువగా ఉండే విత్తనాలను చేర్చుకోవడం చాలా అవసరం.

Weight Gain Diet: ఈ గింజలు తింటే ఈజీగా బరువు పెరుగుతారు..!
Weight Gain

Updated on: May 26, 2025 | 4:35 PM

హెంప్ సీడ్స్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి వనరు. 100 గ్రాముల హెంప్ సీడ్స్ లో సుమారు 30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి ఒమేగా 3, ఒమేగా 6 వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలను కూడా అందిస్తాయి. ఇవి కండరాల పెరుగుదలకు, గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఈ గింజలను సలాడ్లు, స్మూతీలలో లేదా కూరగాయలతో కలిపి తినడం మంచిది.

పొద్దుతిరుగుడు గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ Eతో నిండి ఉంటాయి. 100 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాల్లో సుమారు 20.8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ E మీ చర్మానికి, రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది. వీటిని స్నాక్స్‌ లా నేరుగా తినవచ్చు లేదా వివిధ వంటకాల్లో చేర్చుకోవచ్చు.

అవిసె గింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఎక్కువగా ఉండి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 100 గ్రాముల అవిసె గింజల్లో సుమారు 18.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి జీర్ణక్రియకు సహాయపడుతూ శరీరంలో శక్తిని పెంచుతాయి. ఈ గింజలను పొడి చేసి స్మూతీలు లేదా ఓట్స్ పై చల్లి తినడం మంచిది.

గుమ్మడికాయ విత్తనాలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. 100 గ్రాముల గుమ్మడికాయ విత్తనాల్లో సుమారు 18.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఈ విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని నేరుగా లేదా వంటకాల్లో కలిపి తినవచ్చు.

చియా విత్తనాలు చిన్నవైనా చాలా శక్తివంతమైనవి. 100 గ్రాముల చియా విత్తనాల్లో సుమారు 16.5 గ్రాముల ప్రోటీన్ తో పాటు అధిక ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో శక్తిని పెంచి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. రాత్రిపూట నీటిలో నానబెట్టి, స్మూతీలు లేదా ఓట్స్‌ లో కలిపి తినడం వల్ల బరువు పెరగడానికి బాగా సహాయపడతాయి.

బరువు పెరగాలనుకునే వారు ఈ విత్తనాలను రోజూవారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు చూస్తారు. వీటి వల్ల కేవలం బరువు మాత్రమే కాదు.. శరీరానికి శక్తి, ఆరోగ్యం కూడా మెరుగుపడతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)