చీప్‌గా చూసేరు.. డయాబెటిస్‌కు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. ఉదయాన్నే ఓ గ్లాస్ తాగితే దెబ్బకు చెక్ పడాల్సిందే..
ఉరుకులు పరుగుల ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ (మధుమేహం) కేసుల సంఖ్య పెరుగుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా లక్షలాది మంది మధుమేహం బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో కూడా మధుమేహం కేసుల సంఖ్య పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Updated on: May 24, 2025 | 1:06 PM

ఉరుకులు పరుగుల ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ (మధుమేహం) కేసుల సంఖ్య పెరుగుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా లక్షలాది మంది మధుమేహం బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో కూడా మధుమేహం కేసుల సంఖ్య పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. కావున.. మధుమేహంపై అవగాహనతో ఉండాలని, నియంత్రణపై దృష్టిపెట్టాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలు పెరగడం వల్ల డయాబెటిస్ వస్తుంది. మధుమేహాన్ని సకాలంలో నియంత్రించకపోతే, అది ప్రమాదకరంగా మారుతుందంటున్నారు.

మెంతి గింజల నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. మెంతి గింజల నీరు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో బాగా పనిచేస్తుంది. మెంతి గింజల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రాణాంతక గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది.

fenugreek seeds water

మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ మెంతి నీటిని తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. మెంతులు ప్రోబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని వినియోగం శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. డైలీ తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉండటంతోపాటు బరువు కూడా తగ్గుతుంది..

Fenugreek Water




