విపరీతంగా దాహం వేస్తుందా..? ఈ 5 ప్రమాదకర వ్యాధులు కారణం కావచ్చు.. బీకేర్‌ఫుల్..

ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.. దీంతో ప్రజలు ఓవైపు ఎండ.. మరోవైపు తీవ్ర ఉక్కపోతతో సతమతమవుతున్నారు.. ఇలాంటి పరిస్థితిలో మనల్ని మనం నిర్జలీకరణంగా (హైడ్రేటెడ్), ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉత్తమమైన మార్గం క్రమం తప్పకుండా నీరు త్రాగడమే...

విపరీతంగా దాహం వేస్తుందా..? ఈ 5 ప్రమాదకర వ్యాధులు కారణం కావచ్చు.. బీకేర్‌ఫుల్..
Excessive Thirst Causes

Updated on: Jun 03, 2024 | 2:43 PM

ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.. దీంతో ప్రజలు ఓవైపు ఎండ.. మరోవైపు తీవ్ర ఉక్కపోతతో సతమతమవుతున్నారు.. ఇలాంటి పరిస్థితిలో మనల్ని మనం నిర్జలీకరణంగా (హైడ్రేటెడ్), ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉత్తమమైన మార్గం క్రమం తప్పకుండా నీరు త్రాగడమే… వాస్తవానికి శరీరానికి బాగా  చెమట పట్టినా లేదా వేడిగా అనిపించినా దాహం తీరడానికి పావు నుంచి అర లీటరు నీరు సరిపోతుంది. దాహం అనిపించడం సాధారణం.. కానీ ఎక్కువ నీరు త్రాగిన తర్వాత కూడా ఇది ఆగకపోతే వైద్యుల సంప్రదించడం మంచిది.. ముఖ్యంగా ఎండాకాలంలో పదపదే దాహం వేస్తుంది.. కొన్ని సందర్భాల్లో దాహం వేస్తే ఏం కాదు కానీ.. తరచూ దాహం వేస్తేనే ప్రమాదకరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

కొంతమందికి ఎందుకు ఎక్కువ దాహం అనిపిస్తుంది?

చాలా మంది దాహం తీర్చుకోవడానికి అనేక గ్లాసుల నీరు తాగినా.. లేదా చల్లటి రసం, శీతల పానీయాలు తాగినా.. వారి దాహం ఎప్పటికి తీరిపోదు.. ఇలాంటి సందర్భాన్ని Polydipsia అంటారు. అయితే.. ఎక్కువ దాహం వేయడం ప్రమాదకరం.. దీన్ని నివారించేందుకు వైద్యులను సంప్రదించడం మంచిది.. ఇది కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతుంది.. అయితే.. ఎక్కువగా దాహం వేయడం వెనుకున్న కారణాలు ఏమిటో తెలుసుకోండి..

డీహైడ్రేషన్: ఇప్పటికే శరీరంలో నీటి లోపం ఎక్కువగా ఉంటే, ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు త్రాగితే దాహం తీరదు.. దీని కోసం గొంతును కొద్దికొద్దిగా తడుపుతూ ఉండాలి.. అంటే కొంచెం కొంచెం నీరు తాగుతూ ఉండాలి..

పొడి నోరు: చాలా మంది తమ నోటిలో తగినంత మొత్తంలో లాలాజలం ఉత్పత్తి చేయరు. దీని కారణంగా వారి నోరు పొడిగా అనిపిస్తుంది. పదేపదే నీరు త్రాగినప్పటికీ వారి దాహం తీరదు.

మధుమేహం: డయాబెటిస్ అనేక వ్యాధులకు మూలం.. డయాబెటిక్ రోగుల ప్రధాన సమస్య ఏమిటంటే వారు అధిక దాహం అనుభూతి చెందుతారు. ఈ సమస్య ఉన్న వారికి పదే పదే నీరు తాగాలనిపిస్తుంది.

ఆహార అలవాట్లు: మీరు జంక్ ఫుడ్ లేదా ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటుంటే, పదే పదే దాహం వేయడం సహజం..

రక్తహీనత: శరీరంలో రక్తం లేకపోవడాన్ని రక్తహీనత అంటారు. హిమోగ్లోబిన్ లోపం ఉంటే.. నీరు తాగినప్పటికీ.. తర్వాత కూడా దాహం అనిపిస్తుంది.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us