Open Defecation: పబ్లిక్‌ టాయిలెట్లతో ప్రాణాంతక వ్యాధులు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

|

Nov 19, 2024 | 9:27 PM

అపరిశుభ్రత, అవగాహన లోపం వల్ల బహిరంగా మలవిసర్జన వల్ల ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవగాహన లేకపోతే ఇబ్బందుల్లో పడిపోతారు..

Open Defecation: పబ్లిక్‌ టాయిలెట్లతో ప్రాణాంతక వ్యాధులు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?
Open Defecation
Follow us on

బహిరంగ మలవిసర్జన, పబ్లిక్‌ టాయిలెట్లు వినియోగించడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తాయని చాలా మందికి తెలియదు. దీని గురించి పెద్దగా అవగాహన కూడా చాలా మందికి ఉండదు. కానీ పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంలో కృషి చేస్తున్నాయి. 2014 తర్వాత, మరుగుదొడ్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంలో మనదేశం సాధించిన విజయం సాధించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ ద్వారా మరుగుదొడ్ల భద్రతపై అవగాహన కల్పించడమే కాకుండా మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది.బహిరంగ మలవిసర్జన అనేది లక్షలాది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే, అనేక వ్యాధులకు కారణమయ్యే తీవ్రమైన సమస్య. దీని వల్ల మహిళలు శారీరకంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ విషయంపై అవగాహన పెంచుకుని మరుగుదొడ్లను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే ప్రమాదాలు

  • అతిసారం.. పిల్లల్లో పోషకాహారలోపానికి అతిసారం ప్రధాన కారణం. ఇది మరణానికి దారి తీస్తుంది.
  • కలరా.. కలరా అనేది కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్.
  • టైఫాయిడ్.. టైఫాయిడ్ అనేది కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా జ్వరం.
  • హెపటైటిస్ ఎ.. హెపటైటిస్ ఎ అనేది కలుషితమైన ఆహారం, నీటిని తీసుకోవడం వల్ల కలిగే అంటు కాలేయ వ్యాధి.

టాయిలెట్ శుభ్రంగా ఉంచుకోవడం ఎలా?

  • టాయిలెట్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. దీని కోసం టాయిలెట్ క్లీనర్‌ను ఉపయోగించవచ్చు లేదా దానిని శుభ్రం చేయడానికి నిమ్మ, ఉప్పు కలిపిన ద్రావణాన్ని తయారు చేయవచ్చు.
  • ఎల్లప్పుడూ సీటును మూసివేసి ఉంచాలి. అలాగే టాయిలెట్ ఉపయోగించిన తర్వాత ఫ్లష్ చేయాలి. ఫ్లష్ చేసిన తర్వాత సీటును మూసివేయాలి.
  • టాయిలెట్ పేపర్ ఉపయోగింయాలి.
  • టాయిలెట్‌లో ఇతర పదార్థాలను వేయకూడదు. టాయిలెట్‌లో నూనె, పెయింట్, రసాయనాలు వంటి ఇతర పదార్థాలను ఉంచవద్దు.
  • టాయిలెట్ చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.