Health Tips: గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గించే సూపర్ ఫుడ్.. ఈ ఒక్కటి తీసుకుంటే ఆ టెన్షన్ లేనట్టే

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌లు శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు. ఇవి పాలీశాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉండే ఆహారాలు లేదా సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎన్నో రకాల జబ్బుల నుంచి ఇవి కాపాడుతాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోలేనివారు సప్లిమెంట్ల రూపంలో కూడా తీసుకుంటుంటారు. ఈ పేరు చెప్పగానే మనుకు ముందుగా గుర్తొచ్చేది చేపలే. అయితే చేపలతో పాటు ఇంకా చాలా రకాలైన ఫుడ్స్ నుంచి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి అవేంటో చూద్దాం..

Health Tips: గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గించే సూపర్ ఫుడ్.. ఈ ఒక్కటి తీసుకుంటే ఆ టెన్షన్ లేనట్టే
Heart Health Omega 3 Fatty Acids

Updated on: Feb 27, 2025 | 8:29 PM

శరీరంలో వాపు ప్రక్రియను తగ్గించే గుణం ఒమెగాలో అత్యధికంగా ఉంది. రక్తం గడ్డకట్టకుండా చేయడంతో ఈ ఫ్యాటీ యాసిడ్లది కీలక పాత్ర. గుండె సంబంధిత అనారోగ్యాలను నయం చేయడం, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించడం వంటివి వీటిలో ముఖ్యంగా కనిపించే ప్రయోజనాలు. నాడీ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు కచ్చితంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న పదార్థాలను డైట్ లో యాడ్ చేసుకోవాలి. అంతేకాదు మెదడుకు రక్తప్రసరణ సరిగా కావాలన్నా జ్ఞాపకశక్తి పెరగాలన్నా కూడా ఈ సప్లిమెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోషకాలు లభించే ఫుడ్స్ గురించి తెలుసుకోండి..

చేపలు..

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉండేది చేపల్లోనే. ఈ పోషకాన్ని అందించే ఫుడ్స్ లో చేపలు అగ్రస్థానంలో ఉంటాయి. చిన్న రకాల చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి సముద్రపు నాచుని తింటాయి కాబట్టి ఒమేగా 3 ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అలాగే, సాల్మన్ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్లు, మెగ్నీషియం, పొటాషియం, నియాసిన్ , విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి.

అవిసె గింజలు..

అవిసె గింజలు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ అందిచడానికి అద్భుతమైన మూలం. మీ ఆహారంలో అవిసె గింజలను చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుకు తోడ్పడుతుంది.

వాల్‌నట్స్‌..

వాల్‌నట్స్‌లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు మెండుగా ఉంటాయి. వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, మెదడు పనితీరు మెరుగుపడుతుంది, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సోయాబీన్స్..

సోయాబీన్స్‌లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉంటాయి. మీ ఆహారంలో టోఫు, సోయా మిల్క్, టేంపే వంటి సోయా-ఆధారిత ఉత్పత్తులను చేర్చడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఎముకల దృఢంగా మారతాయి. మెనోపాజ్‌ లక్షణాలను కూడా ఇవి తగ్గిస్తాయి.

చియా సీడ్స్..

చేతిలో పట్టుకుంటే జారిపోయేంత చిన్న పరిమాణంలో ఉండే ఈ గింజల్లో ప్లాంట్స్ నుంచి వచ్చే ఒమెగా 3 అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఫైబర్, ప్రొటీన్లు కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి. చియా గింజలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తీసుకున్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి.

 

Follow Us