Obesity: ఊబకాయం తగ్గించడానికి నోటిలో ఉపయోగించగలిగే పరికరం కనిపెట్టిన శాస్త్రవేత్తలు

|

Jul 05, 2021 | 8:08 AM

Obesity: న్యూజిలాండ్‌లోని శాస్త్రవేత్తలు నోటి ద్వారా బరువు తగ్గించడానికి సహాయపడే ప్రక్రియను కనుగొన్నారు. దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటి బరువు తగ్గించే పరికరాన్ని రూపొందించారు.

Obesity: ఊబకాయం తగ్గించడానికి నోటిలో ఉపయోగించగలిగే పరికరం కనిపెట్టిన శాస్త్రవేత్తలు
Obesity Machine
Follow us on

Obesity: న్యూజిలాండ్‌లోని శాస్త్రవేత్తలు నోటి ద్వారా బరువు తగ్గించడానికి సహాయపడే ప్రక్రియను కనుగొన్నారు. దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటి బరువు తగ్గించే పరికరాన్ని రూపొందించారు. దీనికి ‘డెంటల్‌స్లిమ్ డైట్ కంట్రోల్’ అని పేరు పెట్టారు. ఈ పరికరం దవడను లాక్ చేయడం ద్వారా ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఈ పరికరాన్ని విజయవంతంగా పరీక్షించారు. ఈ విధానం పరీక్షలు చేసిన సమయంలో, ఊబకాయ బాధితులు 2 వారాల్లో 6.36 కిలోల బరువు కోల్పోయారు.

పరికరం ఇలా పనిచేస్తుంది..

ఈ పరికరం ఎగువ, దిగువ దవడలను పట్టిఉంచేలా ఉంటుంది. ఈ పరికరంలోని అయస్కాంతం కారణంగా, మానవ నోరు 2 మిమీ కంటే ఎక్కువ తెరవదు. తత్ఫలితంగా, ఒక వ్యక్తి ముతక ధాన్యాలను సులభంగా నమలడం చేయలేడు, అతను ద్రవ ఆహారం మీద ఆధారపడవలసి ఉంటుంది. దీంతో బరువు పెరగదు. ఒటెగో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు రూపొందించారు. ఈ పరికరాన్ని అమర్చుకున్న వ్యక్తి మాట్లాడే సామర్థ్యాన్ని పరికరం ఏమాత్రం ప్రభావితం చేయదని పరిశోధకులు చెప్పారు. అదేవిధగా శ్వాస తీసుకోవడంలో కూడా ఎటువంటి సమస్యలు ఉండవని అన్నారు. బ్రిటిష్ డెంటల్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధనల ప్రకారం, అత్యవసర పరిస్థితుల్లో ఈ పరికరాన్ని తొలగించవచ్చు. బరువు తగ్గడానికి ఈ కొత్త పద్ధతిలో, ప్రజలు క్రమంగా తక్కువ కేలరీల ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటారని పరిశోధకుకు పాల్ బూంటన్ పేర్కొన్నారు. ఈ పరికరం ఊబకాయంతో పోరాడటానికి సురక్షితం. అంతే కాకుండా ప్రజల బడ్జెట్‌లో ఉంటుందని ఆయన వెల్లడించారు.

పరిశోధకులు ఈ పరికరాన్ని ఎటువంటి శాస్త్ర చిక్త్సలు అవసరం లేకుండా దవడలలో అమర్చారు. బరువు తగ్గించే శస్త్రచికిత్స చేయించుకోవాలని యోచిస్తున్న అధిక బరువు ఉన్నవారికి, డెంటల్‌స్లిమ్ పరికరం మంచి ఎంపిక. దీనివల్ల వారు శస్త్రచికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చులు చేయాల్సిన పని ఉండదు.

ప్రతి సంవత్సరం ఊబకాయం వల్ల 28 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయానికి ప్రతి సంవత్సరం 28 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ వయోజన జనాభాలో 57% 2030 నాటికి అధిక బరువు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 190 కోట్ల మంది అధిక బరువుతో ఉన్నారని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి.

Also Read; Hemoglobin Increase: మీరు రక్తహీనతతో బాధపడుతున్నారా..? శరీరంలో రక్తాన్ని పెంచే ఆహారాలు ఇవే..!

Delta Variant: వేగంగా వ్యాప్తిస్తున్న డెల్టా వేరియంట్.. 98 దేశాల్లో గుర్తింపు .. నివారణ చర్యలను సూచించిన డబ్ల్యుహెచ్ఒ చీఫ్