Bad Food Combinations: ఆహారపదార్ధాలను .. వేరే పదార్ధాలతో కలిపి తినకూడదట… ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏమిటో చూద్దాం..

|

Sep 13, 2021 | 10:02 AM

Bad Food Combinations in Ayurveda మనం ఆరోగ్యంగా ఉంటే ఏ పని అయినా చేయగలం.. సంతోషంగా జీవించగలం అందుకనే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారు. అయితే ప్రసుతం మనం తినే ఆహారపు..

Bad Food Combinations:  ఆహారపదార్ధాలను .. వేరే పదార్ధాలతో కలిపి తినకూడదట... ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏమిటో చూద్దాం..
Food Combinations
Follow us on

Bad Food Combinations in Ayurveda మనం ఆరోగ్యంగా ఉంటే ఏ పని అయినా చేయగలం.. సంతోషంగా జీవించగలం అందుకనే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారు. అయితే ప్రసుతం మనం తినే ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఇక తినే ఆహారపదార్ధాలను కూడా ఎలా ఏ విధంగా తీసుకోవాలో తెలియక చాలామంది రోగాల బారిన పడుతున్నారు. ఆకలి వేస్తుంది కదా అందుబాటులో ఏది ఉంటె అది ఇష్టమైన రీతిలో తింటే హెల్త్ కు మంచిది కాదు. ఇక కొన్ని పదార్ధాలను అన్నం తినడానికి ముందు కానీ, భోజనం చేసిన తరవాత గానీ .. తినే ఆహారంలో కానీ కలిగి తినకూడు.. అలా చేస్తే.. ఉన్న రోగాలు ఎక్కువ అవుతాయట.. లేని వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని పెద్దలు చెబుతారు. ఈరోజు ఆహారాలను తినేటప్పుడు.. కలిపి తినకూడని పదార్థాల గురించి తెలుసుకుందాం..

*తేనే,  నెయ్యి కలిపి అసలు తినకూడదు.. ఇలా ఎండు కలిపి తింటే అది విషం తో సమానమట.
* రాగి పాత్ర నిల్వ ఉంచిన నెయ్యిని తినకూడదు.
*పెరుగు  లేదా మజ్జిగ తో కలిపి అరటి పండుని తినకూడదు.
* అన్నం, పండ్లు కలిపి తినకూడదు. అలా తినడం వల్ల పండ్లలోని ఉన్న మినరల్స్ నశిస్తాయట.
*కూరగాయలు, వెన్న కలిపి తినడం  ఆరోగ్యానికి హానికరం.
*చేపల కూర తిన్నవెంటనే పాలు కానీ పెరుగు కానీ పాల పదార్థాలను తినకూడదు.. అలా తింటే కుష్టి రోగం వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి.
*ఆస్తమా రోగులు గుమ్మడి కాయ, టమాటా, ముల్లంగి ని తినకూడదు
*ఆస్తమా రోగులు తడి తలతో ఎక్కువ సేపు ఉండరాదు.
*మొలలతో బాధపడేవారు గుడ్లు , మాంసం తినకూడదు.
* అల్సర్ వ్యాధితో బాధపడుతున్నవారు కారం, మసాలాలు ఎక్కువగా తినకూడదు.
* చర్మ రోగాలతో ఇబ్బదులు పడుతున్నవారు పొట్లకాయలు, ఎండు చేపలు, శనగలు, బీన్స్ ఎక్కువగా తినకూడదు.
* నువ్వుల నూనె ను ఉపయోగించి గోధుమలతో వండినటువంటి ఏ పదార్థాన్ని కూడా తినకూడదు.
* మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నవారు మాంసం , గుడ్లతో చేసిన వంటకాలకు దూరంగా ఉంటె మంచిది

ఇక చాలామందికి పొద్దున్నేనిద్ర లేచిన వేంటనే మంచి మీదనుంచి దిగకుండానే.. బెడ్ కాఫీ తాగడం అలవాటు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం.. కనుక బెడ్ కాఫీ అలవాటుని తప్పించుకోవడం మంచిది. లేదంటే గోరువెచ్చని నీళ్లు ముందుగా తాగి అనంతరం బెడ్ కాఫీ, టీ తాగవచ్చు.

Also  Read :  నాన్ వెజ్ అలవాటు లేనివారికి ఉడికించిన శనగలు ఒక వరం.. రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..