Covid: కరోనా వేరియంట్స్‌కు భయపడాల్సిన పనిలేదు.. 93శాతం మంది ప్రజల్లో యాంటీబాడీస్‌ వచ్చేశాయన్న NIN సీనియర్ సైంటిస్ట్‌..

|

Dec 21, 2022 | 5:37 PM

ఇప్పటికే 93శాతం మంది ప్రజల్లో యాంటీబాడీస్‌ వచ్చేశాయని.. మరోవేవ్‌ వచ్చినా పెద్ద ప్రమాదమేమీ లేదని తేల్చి చెబుతోంది. ఎలాంటి సమస్య ఉండదంటున్నారు ఎన్‌ఐఎన్‌..

Covid: కరోనా వేరియంట్స్‌కు భయపడాల్సిన పనిలేదు.. 93శాతం మంది ప్రజల్లో యాంటీబాడీస్‌ వచ్చేశాయన్న NIN సీనియర్ సైంటిస్ట్‌..
NIN
Follow us on

కరోనా వేరియంట్స్‌ ఎన్ని వచ్చినా భయపడాల్సిన పనిలేదని చెబుతోంది జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) సర్వే. ఇప్పటికే 93శాతం మంది ప్రజల్లో యాంటీబాడీస్‌ వచ్చేశాయని.. మరోవేవ్‌ వచ్చినా పెద్ద ప్రమాదమేమీ లేదని తేల్చి చెబుతోంది. ఎలాంటి సమస్య ఉండదంటున్నారు ఎన్‌ఐఎన్‌ సీనియర్ శాస్త్రవేత్త, ఎపడాలమిస్ట్ డాక్టర్ లక్ష్మయ్య. కొత్త కరోనా వేరియంట్స్ దాడిచేసినా ఇన్‌ ఫెక్షన్ కూడా తక్కువగానే ఉండే అవకాశాలున్నాయంటున్నారు. హాస్పిటలైజేషన్‌ కూడా తక్కువగానే ఉంటుందని అంటున్నారు.

అంతే కాదు.. జాతీయ స్తాయిలో సర్వే చేసినట్లుగా తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ సర్వే చేసినట్లుగా వెల్లడించారు. ఎంత మందిలో యాంటీబాడీస్‌ వచ్చాయా.. లేదా అనే కోణంలో తమ పరిశోధన సాగిందని వెల్లడించారు. ఒక్కో జిల్లాలో 100 షాపిల్స్ తీసుకున్నట్లుగా తెలిపారు. మొత్తం 18 వేల షాపిల్స్ తీసుకున్నట్లుగా తెలిపారు. ఇందులో చాలా మందిలో యాంటీబాడీస్ కనిపించాయని అన్నారు. 93 శాతం జనాభలో యాంటీబాడీస్ ఉన్నాయని తెలిపారు. ఇవి వ్యాక్సిన్ వల్లా వచ్చాయని అన్నారు. ఈ యాంటీబాడీస్ కొత్తగా వచ్చే ఎలాంటి వేవ్స్‌ను ఇవి తట్టుకునే శక్తి ఉంటుందన్నారు.

కొత్తగా వచ్చే వేవ్స్‌తో ఎలాంటి భయం లేదని తెలిపారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్క్ పెట్టుకోవడం.. ముఖ్యంగా జన సంచారం ఉన్న చోట తప్పనిసారిగా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

డ్రాగన్ కంట్రీ ఎఫెక్ట్‌తో..

చైనాలో మ‌ళ్లీ కోవిడ్ విజృంభణతో దేశంలో ఉన్న కోవిడ్ ప‌రిస్థితుల‌పై కేంద్ర మంత్రి మాండ‌వీయ స‌మీక్షించారు. కోవిడ్ వేరియంట్ల‌ను ట్రాక్ చేసేందుకు పాజిటివ్ పేషెంట్ల‌కు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాల‌ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

జపాన్​, అమెరికా, చైనా, బ్రెజిల్​, దక్షిణ కొరియా దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. మరోవైపు మహారాష్ట్రలో కోవిడ్ పరిస్థితిని పర్యవేక్షించడానికి ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్..

మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు

ఇండియాలోని మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మళ్లీ గతంలో ఎదురైన పరిస్థితులే తలెత్తుతాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.అందుకే కేంద్రం జీనోమ్ సీక్వెన్స్ తప్పక జరిపించాలని కోరుతోంది కేంద్ర ఆరోగ్య శాఖ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం