Health Problems: మహిళలు రాత్రి షిఫ్టులో విధులు నిర్వహిస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!

|

Oct 14, 2022 | 4:32 PM

నేటి యుగంలో డిజిటల్ టెక్నాలజీ మానవుల సవాళ్లను కూడా పెంచుతోంది. కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు..

Health Problems: మహిళలు రాత్రి షిఫ్టులో విధులు నిర్వహిస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
Health Problems
Follow us on

నేటి యుగంలో డిజిటల్ టెక్నాలజీ మానవుల సవాళ్లను కూడా పెంచుతోంది. కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు పదేపదే చెబుతున్నారు. ప్రజలు తమ కెరీర్‌లో ముందుకు రావడానికి చాలా కష్టపడతారు. తమ ఉత్తమమైనదాన్ని అందించడానికి చాలాసార్లు ప్రజలు కొన్నిం టిని ఎదుర్కొనేందుకు వెనుకాడరు. ఉద్యోగ రీత్య చాలా మంది రాత్రి షిఫ్ట్‌లో పనిచేయడానికి వెనుకాడరు. అయితే నైట్ షిఫ్ట్‌లో పని చేయడం చాలా ప్రమాదకరమని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. నైట్ షిఫ్ట్‌లో పని చేయడం వల్ల మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

నైట్ షిఫ్ట్ క్యాన్సర్ ప్రమాదం:

నివేదికల ప్రకారం.. రాత్రి షిఫ్ట్‌లో ఎక్కువసేపు పనిచేసే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతోంది. నైట్ షిఫ్ట్‌లో పనిచేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పరిశోధనలు వెల్లడించాయి. వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ చేసిన పరిశోధనలో కూడా ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధన రాత్రి షిఫ్ట్‌లో పనిచేసే వారికి చర్మ క్యాన్సర్‌తో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కనుగొన్నారు.

నైట్ షిఫ్ట్, బ్రెస్ట్ క్యాన్సర్ మధ్య సంబంధం ఏమిటి?

మీరు రాత్రి పని చేసినప్పుడు అది మిమ్మల్ని కాంతికి గురి చేస్తుంది. ఇది మీ సిర్కాడియన్ రిథమ్‌లో ఆటంకాలను కలిగిస్తుంది. ఇది ప్రోలాక్టిన్, గ్లూకోకార్టికాయిడ్లు, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, సెరోటోనిన్, మెలటోనిన్‌తో సహా మీ శరీరంలోని అనేక హార్మోన్ల ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నిరంతర రాత్రి షిఫ్టులు శరీరంలో మెలటోనిన్ సంశ్లేషణకు ఆటంకం కలిగిస్తాయి. ఇది ఈస్ట్రోజెన్ స్థాయిల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడానికి కారణం.

ఇవి కూడా చదవండి

ఇది కూడా కారణం:

రాత్రిపూట పనిచేసే స్త్రీలు కూడా ఒత్తిడిని వదిలించుకోవడానికి ధూమపానం చేయడం కూడా చేస్తుంటారు. దీని వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది. రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి రాత్రి షిఫ్ట్‌లో పనిచేయడం మానుకోవడం మంచిదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట పని చేయాల్సిన అవసరం ఉంటే పగటిపూట కనీసం 7-8 గంటలు నిద్రపోండి. దీనితో పాటు, మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా అనుసరించండం ముఖ్యమంటున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి