Copper Utensils: మారుతున్న కాలంతో పాటే మనుషుల అలవాట్లు మారాయి. పూర్వీకులు వాడే రాగి, మట్టి పాత్రల ప్లేస్‌లో ప్లాస్టిక్, నాన్ స్టిక్ వంటివి చేరుకున్నాయి. దీంతో మనుషులు వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే వీటికి చక్కటి పరిష్కారం చూపిస్తున్నాయి రాగి పాత్రలు. రాగి పాత్రల్లో వంటల తయారీ, భోజనం చేయడం ఆరోగ్యకరమైన విషయాలని మన పెద్దలు చెప్పేవారు. నీటిలో ఉన్న బ్యాక్టీరీయాను తరిమికొట్టి సహజసిద్ధంగా శుద్ధి చేసే గుణం రాగి సొంతం అని వైద్యనిపుణులు చెప్పారు. రాగి పాత్రలో నీరు తాగితే బ్యాక్టీరియా, ఫంగస్ వంటి మైక్రో ఆర్గానిజం దరిచేరదని పరిశోధనలు తేల్చాయి. అందుకే వెనుకటి తరంవారు రాగి పాత్రలు ఇంట్లో ఉంటే రోగాలు రావు అనేవాళ్లు. ఎవరైనా అతిధులు ఇంటికి రాగానే రాగి చెంబుతో తాగడానికి నీరు ఇచ్చేవారు. రాత్రంతా రాగిపాత్రలో నిల్వ చేసిన నీటిని ఉదయాన్నే తాగితే శరీరంలోని విషపదార్థాలు బయటకెళ్లిపోతాయని చెప్పడంతో.. ఇటీవల రాగి పాత్రల వినియోగం భారీగా పెరిగింది.
రాగి పాత్రలను వాడటం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియడంతో రకరకాల అవసరాల కోసం మళ్ళీ రాగి పాత్రలను వినియోగిస్తున్నారు. అయితే రాగి పాత్రల్లో కొన్ని కొన్ని ఆహారపదార్ధాలను ఉంచకూడదు. కొన్నింటిని రాగి పాత్రల్లో ఉంచే అవి శరీరానికి మేలు చేయడం మాట అటువంటి.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని.. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఆ ఆహార పదార్థాలు ఏంటీ.? ఎందుకు ఉంచరాదు తెలుసుకుందాం..
రాగి గిన్నెల్లో నిల్వ పచ్చళ్ళే కాదు.. రోటి పచ్చళ్ళు కూడా పెట్టరాదు. ఇలా రాగి పాత్రల్లో పెట్టిన పచ్చళ్ళు తింటే జీర్ణ సంబంధ సమస్యలు ఏర్పడవచ్చు. ఇక వాంతులు అయ్యే అవకాశం కూడా అధికమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాగి గ్లాస్‌తో నిమ్మ రసం తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం.. గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
ఇక రాగి గిన్నెల్లో నిల్వ చేసిన పాలను తాగినా ఆరోగ్యానికి హానికరం.. ఇలా తాగితే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందట.
రాగి పాత్రల్లో పాలు మాత్రమే కాదు పెరుగు, జున్ను మజ్జిగ, లస్సీలు వంటి పాలపదార్ధాలను కూడా ఉంచరాదు.
ముఖ్యంగా రాగి పాత్రల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పుల్లటి ఆహార పదార్థాలను ఉంచరాదు.. అలా రాగి పాత్రలో ఉంచిన ఆ ఆహారపదార్ధాలను తింటే.. మీ అనారోగ్యాన్ని మీరు చేజేతులా తెచ్చుకున్నట్లే అని అంటున్నారు.
Also Read: మరో ఇద్దరు హిందువుల మృత దేహాలు లభ్యం.. హింసలో ఆరుకు చేరిన మొత్తం మృతుల సంఖ్య